అప్పుడప్పుడు జంతువులకు వింత ఆకారంలో పిల్లలు పుట్టడం జరుగుతుంటుంది.అయితే నవంబర్ 11న, విదిషాలోని సిరోంజ్ తహసీల్‌లో ఒక తల్లి మేకకు మనిషి ముఖంతో తెల్ల గడ్డంతో ఒక పిల్ల మేక జన్మించింది.
వృద్ధుడిలా కనిపించే ఫేస్‌తో ఈ మేక చాలా వింతగా ఉండటంతో దీన్ని చూసేందుకు గ్రామస్తులంతా తరలివస్తున్నారు.ఒక ముసలి తాత ముఖంలా ఉన్న ఈ మేక పిల్లను చూసి కొందరు స్టన్ అవుతున్నారు.
తల్లి మేక యజమాని నబాబ్ ఖాన్ కూడా ఈ పిల్ల మేక ఆకారాన్ని చూసి జడుసుకున్నాడు.ఈ మేక ఆంత్రోపోమోర్ఫిక్ ముఖ నిర్మాణం, నల్లటి రింగులతో కవర్ అయిన క్రిస్టల్ కళ్లతో మందపాటి తెల్లటి బొచ్చుతో పుట్టిందని.
దీన్ని చూడగానే తాను చాలా భయపడి పోయినట్లు ఆయన చెప్పాడు.ఈ సంఘటనపై వెటర్నరీ డాక్టర్ మానవ్ సింగ్ మాట్లాడుతూ, మేక పిల్ల తల వాచిపోవడంతో ఇలాంటి ఆకృతి వచ్చిందని చెప్పారు.
వైద్య పరిభాషలో దీనిని హైడ్రోసెఫాలస్ లేదా హెడ్ డిస్పెప్సియా పిలుస్తారని పేర్కొన్నారు.

గర్భధారణ సమయంలో తల్లిలో లోపం లేదా గర్భధారణ సమయంలో తల్లికి తప్పుడు మందులు ఇవ్వడం వల్ల ఇది సంభవిస్తుందన్నారు.ప్రతి 50,000 జంతువుల పుట్టకల్లో ఒకదానిలో కనిపించే అరుదైన కేసు ఇది అని ఆయన అన్నారు.ఈ మేక పిల్లకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో ఇది ఇలా పుట్టిందేంటి అని కామెంట్ చేస్తున్నారు.ఇలా పుట్టిన జంతువులు ఎక్కువ కాలం బతకవని, ఆ నిజం తమని బాధిస్తోందని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.