నటి జయ చిత్ర..ఈమె అసలు పేరు లక్ష్మి రోహిణి దేవి.1957 లో పుట్టిన ఈ 65 ఏళ్ళ అలనాటి స్టార్ హీరోయిన్ నేటికీ నటనలో తన హవాను కొనసాగిస్తోంది.తన తల్లి ప్రోత్సాహం తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరేళ్ళ వయసులోనే భక్త పోతన సినిమాలో నటించింది జయచిత్ర.ఇక 1972 హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
కన్నడ, తెలుగు మరియు తమిళ సినిమాల్లో ఆమె చాల ఏళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.ఇక ఆమె హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మతగా, దర్శకురాలిగా కూడా పని చేసింది.
ఆమె భర్త ఒక పెద్ద ఇండ్రస్టీలిస్ట్ కావడం తో ఆమెకు డబ్బుకు ఎలాంటి కొదవ లేదు.
ఈ దంపతులకు అమర్ గణేష్ అనే ఏకైక సంతానం కలడు.
ఇక జయ చిత్ర కెరీర్ లో ఎన్నో వివాదాల్లో ఇరుక్కునేది.ఇందుకు గల ప్రధాన కారణం ఆమె ఆధిపత్య ధోరణి.
ఆమె గురించి ఎవరైనా తప్పుగా మీడియా లో రాస్తే ఇంటికి పిలిపించుకొని మరి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేది.ఇక ఆమె సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఆమె ముందు అందరు గౌరవం ఇచ్చి మాట్లాడాలి.కుర్చీలో కూర్చోకూడదు వంటి అనేక కండిషన్స్ పెట్టేది.ఆమె సినిమాలో ఎవరైనా హీరోయిన్ లేదంటే సెన్ద్ లీడ్ ఆర్టిస్ట్ ఉన్నారనే వారిని చాల చులకనగా చూసేది.ఈ ధోరణితో ఆమె చాల సినిమాల విషయం లో వివాదాల పాలయ్యింది.
ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఆమె చాల మంచి సినిమాలు చేసినప్పటికి ఆమె ప్రతి సినిమాకు ఎదో ఒక సమస్య ఉండే ఉంటుంది.చివరికి ఆమె పెట్టె బాధ భరించ లేక రాఘవేంద్ర రావు లాంటి దర్శకుడు అయన తీసే సీరియల్ లో మొదట ఆమెను నటింపచేయాలని అనుకున్నప్పటికి ఆ తర్వాత ఆమె పెట్టె కండిషన్స్ కి భరించలేక చాల చిన్న ఆర్టిస్ట్ ను పెట్టుకొని ఆ సీరియల్ ని తీసి హిట్ కొట్టాడు.ఒక్క హీరో మరియు డైరెక్టర్ కి మాత్రమే ఆమె నమస్కారం చేస్తుంది.
ఆమె కన్నా పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పటికి ఆమె ఎవరిని లెక్క చేయదు.ఇలా ఒక నటి గురించి మాట్లాడటం తప్పే అయినా కూడా నిజాలను నిర్భయం గా చెప్పడం లో మేము ఎప్పుడు ముందే ఉంటాము.
అందుకే ఈ సంఘటన గురించి చెప్పక తప్పలేదు.