టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన విజయవంతం కావడంతో వైసీపీకి భయం పట్టుకుందని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.చంద్రబాబుపై దాడులు జరిగితే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
టీడీపీపై వైసీపీ దాడి చేస్తుంటే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కేంద్రానికి గవర్నర్ ఎందుకు నివేదికలు పంపడం లేదని నిలదీశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి క్యాసినోతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.విజయసాయిరెడ్డికి ఈడీ నార్కో టెస్టు చేయాలని డిమాండ్ చేశారు.