Ganga water : ఇంట్లో గంగాజలాన్ని ఎక్కడ ఏ పాత్రలో వేసి ఉంచడం మంచిదో తెలుసా..

కొన్ని పురాణాల ప్రకారం గంగా జలాన్ని చాలామంది ప్రజలు పవిత్రంగా భావిస్తారు.మన భారత దేశ ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి గంగానది అని ఎంతో మంది భావిస్తారు.

 Do You Know Where It Is Better To Keep Ganga Water In Which Vessel At Home ,ga-TeluguStop.com

నీరుని సంస్కృత భాషలో గంగా అని చాలామంది పిలుస్తారు.చాలామంది ప్రజలు తమ జరిపే పూజా కార్యక్రమాలకే కాకుండా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు కూడా గంగా జలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ కలిసి చేసుకునే పండగలలో భారీ సంఖ్యలో భక్తులు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం కోసం గంగా నది తీరానికి వెళుతుంటారు.

ఇదే కాకుండా గంగాజలాన్ని అత్యంత పవిత్రంగా ఒక పాత్రలో ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ఒక పవిత్రమైన స్థలంలో ఆ పాత్రను ఉండేలా చేస్తారు.గంగాజలం గురించి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేసే గంగాజలాన్ని ఎప్పుడు పవిత్రంగా లేని ప్రదేశాలలో ఉంచడం మంచిది కాదు.గంగాజలాన్ని ఎప్పుడూ కంచు లేదా రాగి పాత్రలలో ఉంచడమే మంచిది.గంగాజలాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ పాత్రలో ఉంచకూడదు.ఈ జలాన్ని మురికి చేతులతో, చెప్పులు ధరించి ఎప్పుడు తాకకూడదు.ఇంకా చెప్పాలంటే ఈ జలాన్ని చీకటి ప్రాంతంలో కూడా ఉంచడం మంచిది కాదు.ఈ గంగా జలాన్ని ఎప్పుడు ఇంటిలోని ఈశాన్య దిశలో ఉంచాలి.

Telugu Bhakti, Copper Vessels, Devotional, Ganga-Latest News - Telugu

గంగా జలాన్ని తాకి ఎప్పుడూ అబద్ధం కూడా చెప్పకూడదు.ప్రతిరోజు భగవంతునికి పూజ చేసే చేయడానికి ముందు దేవతలను గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి.శివునికి పూజ చేసేటప్పుడు గంగాజలం ఎక్కువగా ఉపయోగిస్తారు.ప్రతిరోజు శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేస్తే భక్తుల కోరికలను తీరుస్తాడని చాలామంది భక్తులు నమ్ముతారు.ఇంట్లోనే ప్రతికూల శక్తులు రాకుండా ఉండడం కోసం ఇంట్లో పవిత్రమైన గంగాజలాన్ని ప్రతిరోజు చల్లుకోవడం కూడా మంచిదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube