వామ్మో.. ఈ సైజులో కప్పను ఎప్పుడైనా చూశారా?

ఈ ప్రకృతిలో వివిధ రకాల జంతువులు ఉన్నాయి.మనకు తెలియని జీవులు చాలా ఉన్నాయి.

 Giant Frog Seen In A Viral Video Details, Big Size, Frog, Viral Latest, News Vir-TeluguStop.com

కప్పల విషయానికి వస్తే అవి వర్షా కాలంలో గ్రామాల్లో కొన్ని సార్లు ఇబ్బందులు పెడతాయి.ఇళ్లల్లోకి గెంతుకుంటూ వచ్చేస్తుంటాయి.

వాటిని బయటకు పంపడానికి చాలా మంది కష్టపడుతుంటారు.కప్పలు( Frogs ) వస్తే వాటి వెనుకే పాములు వస్తాయనే భయం ఉంటుంది.

చిన్న పాటి కప్పల నుంచి అర చేయి అంత ఉండే కప్పలు మనకు కనిపిస్తుంటాయి.అయితే అంతకంటే పెద్ద కప్పలు చూశారా అని అడిగితే ఎవరైనా చూడలేదని చెబుతారు.

ప్రస్తుతం అలాంటి ఓ కప్పకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ సైజులో ఉండే ఆ కప్పను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఇది కలా నిజమా అని అనుకుంటున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆ కప్ప భారీ పరిణామంలో( Big Frog ) ఉంటుంది.దానిని టేబుల్‌పై పెట్టగానే అది అటూ ఇటూ తిరుగుతుంటుందతి.

ఈ వీడియో చూసిన వారికి చాలా సందేహాలు వస్తున్నాయి.అది నిజమైన కప్పా? లేక ఈ వీడియో ఎడిట్ చేశారా? అని చాలా మంది నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.కనీ వినీ ఎరుగని సైజులో ఆ కప్ప ఉంటుంది.టేబుల్‌పై దాని పెట్టిన వ్యక్తి ఆ కప్ప కాళ్లను( Frog Limbs ) తన చేతులతో కొలవడానికి ప్రయత్నించాడు.

కప్ప కాళ్లను పరిశీలిస్తే అవి మనిషి చేతులంత ఉన్నాయి.ఈ ఒక్క దాంతో ఆ కప్ప ఎంత ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిష్రూక్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు.ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.తమ జీవితంలో ఇంత పెద్ద కప్పను తామెన్నడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు అయితే ఇలాంటి కప్పలను చైనాకు( China ) ఎగుమతి చేయాలని, అప్పుడు వ్యాపారం బాగా గిట్టుబాటు అవుతుందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube