సినిమా ఇండస్ట్రీ లో సునీల్ త్రివిక్రమ్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే…కెరియర్ మొదట్లో వీళ్లిద్దరూ ఒకే రూం లో ఉండేవారు అలా ఇద్దరు రుమ్మెట్స్ గా ఉంటూనే సినిమా ఇండస్ట్రీ లో చాలా ప్రయత్నాలు చేసేవారు…త్రివిక్రమ్ రైటర్ గా కెరియర్ స్టార్ట్ చేశాక ఆయన రాసిన ప్రతి స్టోరీ లో సునీల్ కోసం ఒక సెపరేట్ క్యారెక్టర్ రాసేవాళ్ళు అలా సునీల్ కోసం సెపరేట్ గా క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లో నువ్వూ నాకు నచ్చావ్ సినిమాలో
బంతి, మల్లేశ్వరి సినిమాలో పద్దు క్యారెక్టర్ మన్మధుడు సినిమాలోని బంక్ శీను లాంటి క్యారెక్టర్ అయితే త్రివిక్రమ్ రైటర్ గా ఉన్న సమయం లో తినడానికి ఇబ్బంది గా ఉన్నప్పుడు త్రివిక్రమ్, సునీల్ ఇద్దరు ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఏది ఉంటే అది తిని మందు బాటిల్స్ తీసుకొని పోయేవారట వీళ్ళు వస్తున్నారు అని తెలిస్తే చాలు ప్రకాష్ రాజ్ భయపడి పోయేవాడట…

త్రివిక్రమ్ రాసిన స్టోరీ లో గాని డైరెక్షన్ చేసిన సినిమాల్లో గానీ స్టార్టింగ్ రోజుల్లో ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్ర పోషించేవారు అలా త్రివిక్రమ్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య అనుబంధం చాలా గొప్పది అని త్రివిక్రమ్ చాలా సందర్భాల్లో చెప్పారు…ఈ మధ్య వస్తున్న త్రివిక్రమ్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఎక్కువ గా కనిపించడం లేదు సన్నాఫ్ సత్యమూర్తి వరకు త్రివిక్రమ్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఉండేవారు

ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసే క్యారెక్టర్స్ సినిమాల్లో లేకపోవడం వల్ల త్రివిక్రమ్ ఆయన్ని తీసుకోవడం లేదు.మళ్ళీ మంచి క్యారెక్టర్ రాసినప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ తెర పైన కనిపిస్తుందని కూడా త్రివిక్రమ్ చెప్పారు…ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే తోపాటు శ్రిలీల కూడా నటిస్తుంది…ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు…
.