భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కుంజా సత్యవతి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన సంగతి తెలిసిందే.కాగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
మరోవైపు సత్యవతి ఆకస్మక మరణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.అదేవిధంగా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య సత్యవతి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
ఆమె మరణం ప్రజలకు తీరని లోటని ఆయన తెలిపారు.