బస్సు యాత్రలకు అంతా రెడీ చేసుకున్న టి. కాంగ్రెస్ !

బీజేపీ ,బీఆర్ఎస్ పార్టీలపై( BJP BRS party ) పై చేయి సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్,  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతోంది .ఓటర్లకు దగ్గరయ్యే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

 Telangana Is All Ready For The Bus Trips. Congress , Congress Bus Tour, Reva-TeluguStop.com

దీనిలో భాగంగానే తెలంగాణలో వినూత్నంగా ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.  నేరుగా బహిరంగ సభలు నిర్వహించడం కన్నా,  బస్సు యాత్రల ద్వారా  ప్రజల దగ్గరికి వెళ్లి వారితో ముచ్చటించాలని నిర్ణయించుకుంది .దీనిలో భాగంగానే బస్సు యాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది.  ఈ మేరకు మూడు విడతల్లో బస్సు యాత్ర చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది.  తొలివిడతో బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )నిర్వహిస్తున్నారు .18వ తేదీన బస్సు యాత్ర( Bus trip ) ములుగు జిల్లాలో ప్రారంభమై,  నిజామాబాదులో ఈ నెల 20వ తేదీన ముగియనుంది.

Telugu Aicc, Congress Bus, Pcc, Priyanka Gandhi, Revanth Reddy, Telangana-Politi

నిజామాబాద్ వద్ద భారీ బహిరంగ సభను ఈ సందర్భంగా ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది .బస్సు యాత్రలో ఎక్కడకక్కడ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించే ఆలోచన కూడా చేస్తున్నారు.ఈనెల 18 నుంచి ముషీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ములుగులో సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగనుంది.అదే రోజు వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలోని రామగుండంలో ఉదయం సభ నిర్వహించాల్సి ఉండగా , సాయంత్రం పెద్దపల్లి , అక్కడ నుంచి కరీంనగర్ లో సభను కాంగ్రెస్ నిర్వహించనుంది.

మూడోరోజు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని బోధన్,  ఆర్మూర్,  నిజామాబాద్ నియోజకవర్గంలో సభలను కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Telugu Aicc, Congress Bus, Pcc, Priyanka Gandhi, Revanth Reddy, Telangana-Politi

అలాగే 18 ,19 ,20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీతో ( Rahul Gandhi )పాటు,  ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )కూడా పాల్గొనబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి .18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి రాహుల్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు.అలాగే అదే రోజు భూపాలపల్లి లో మహిళలతో సమావేశం అవుతారు.

  19న రామగుండంలో సింగరేణి కార్మికులతో,  జగిత్యాల , బోధన్ నిజామాబాద్ లో పాదయాత్ర సభలు నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube