ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయింది.
ఈ ప్రోగ్రాంలో ఇంటర్న్‌షిప్‌తో పాటు గిఫ్ట్ వోచర్‌లు గెలుచుకునే అవకాశం ఉంటుంది.ఈ అవకాశం ఇంజినీరింగ్ విద్యార్థులకే పరిమితం.
ఆ వివరాలు తెలుసుకుందాం.ఫ్లిప్‌కార్ట్ యాన్యువల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది.
దీనికి సంబంధించిన ఫ్లి్లప్‌కార్ట్‌లో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.బీటెక్, బీఈ, ఎంటెక్ లాంటి కోర్సులు చదువుతున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫుల్ టైమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందేందుకు లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఇది మంచి అవకాశం.2022, 2023, 2024, 2025 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయొచ్చు.దీనికి ఒకే ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు గ్రూప్‌గా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఛాలెంజ్‌లో ఫైనలిస్టులు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పొజిష ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు.ఎంపికైనవారికి ఏడాదికి రూ.26.57 లక్షల ప్యాకేజీ లభిస్తుంది.ఇక మూడో రౌండ్ వరకు వచ్చినవారికి కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి.రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.2021 జూలై 8 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.అభ్యర్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ లభిస్తాయి.జూలై 6న ఛాలెంజ్ మొదలవుతుంది.సెప్టెంబర్ 3న నేషనల్ ఫినాలే ఉంటుంది.

ఈ ఎంపిక నాలుగు లెవెల్స్‌లో ఉంటుంది.మొదటి లెవెల్‌లో ఇ–కామర్స్ ట్రివియా, టెక్ స్కిల్స్ క్విజ్, రెండో లెవెల్‌లో ఐడియా ఆన్ ప్రాబ్లమ్ , మూడో లెవెల్‌లో కాన్సెప్ట్‌కు సంబంధించిన డెమో వీడియో, చివరి రౌండ్‌లో సొల్యూష¯Œ ్సని ఫ్లిప్‌కార్ట్ ప్యానెల్‌కు సమర్పించడం ఉంటుంది.ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ 3.0 విజేతలకు రూ.1,50,000 విలువైన గిఫ్ట్ వోచర్స్ లభిస్తాయి.మొదటి రన్నర్ అప్‌కు రూ.75,000 , ఫైనలిస్టులందరికీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది.లెవెల్ 1 క్విజ్‌లో పాల్గొన్న టాప్ 50 టీమ్స్‌కు గ్రిడ్ గుడీస్, మిగతా టీమ్స్‌కు మెరిట్ సర్టిఫికెట్ లభిస్తుంది.కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ కోర్సులకే పరిమితమైన సంగతి తెలిసిందే.
కొన్ని సంస్థలు ఇప్పటికీ కొన్ని క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో అవకాశాలు అందిస్తున్నాయి.ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ కూడా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.