తండ్రులు తమ పిల్లల పట్ల( Children ) చూపించే ప్రేమకు పరిమితులు ఉండవు.పిల్లల భద్రత, సంతోషం కోసం తండ్రులు( Father ) ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు.
వారి హ్యాపీనెస్ కోసమే ఎప్పుడు కష్టపడతారు.తండ్రి తమ పిల్లలపై ప్రేమను కురిపించే హార్ట్ టచింగ్ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి.
వీటిని ఎన్ని చూసినా మళ్ళీ చూడాలనిపించేంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి.తాజాగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఒక వీడియో చాలా మంది హృదయాలను తాకుతోంది.
చలి, ఏమాత్రం బాగోలేని రోడ్డు, రాత్రి సమయం వేళ కూడా ఒక తండ్రి వ్యక్తి తన బిడ్డ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చాడు.తన వెనుక సీట్‌లో కూర్చోబెట్టుకుని బైక్‌పై ( Bike ) వెళుతున్న ఈ తండ్రి వీడియో మొదటగా ట్విట్టర్ వేదికగా ప్రత్యక్షమైంది.ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు బైక్ నడుపుతున్న తండ్రి తన కొడుకుకు శాలువా కప్పి తన చేతితో ప్రొటెక్ట్ చేయడం మనం చూడవచ్చు.ఈ చర్య చాలా మందిని భావోద్వేగానికి గురిచేసింది.
వైరల్ వీడియోలో తండ్రి ఒక చేత్తో బైక్ నడుపుతూ మరో చేత్తో అతని బిడ్డను పట్టుకున్నాడు.
ఇంటర్నెట్ యూజర్లు ఈ వీడియో చూసి తండ్రి ప్రేమను ప్రశంసిస్తున్నారు.అయితే వన్ హ్యాండ్ రైడింగ్( One Hand Riding ) చాలా రిస్కీ అని, రాత్రి గుంటలలో బైక్ బ్యాలెన్స్ తప్పి కింద పడే ప్రమాదం ఉందని కొందరు అన్నారు.పిల్లోడిని ముందు కూర్చోబెట్టుకుంటే ఏ టెన్షన్ లేకుండా వెళ్లొచ్చని ఇంకొందరు పేర్కొన్నారు.
ఘులం అబ్బాస్ షా అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన వీడియోకు 2 లక్షల 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని మీరు కూడా చూసేయండి.