రోజురోజుకూ అక్రమాలు బాగా పెరిగిపోతున్నాయి.అన్ని వస్తువులను కల్తీ మాయం చేస్తున్నారు.
ఆఖరికి తినే వస్తువులను కూడా వదలడం లేదు.ప్రతి వస్తువును కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.
ప్రజలు ఏ వస్తువులో ఏ కల్తీ చేస్తున్నారో అని భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.కల్తీ వస్తువులను తిని చాలా మంది ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అక్రమ దారుల అక్రమాలు ఎక్కడో ఒక చోట మాత్రమే వెలుగు చూస్తున్నాయి.చాలా వరకు అక్రమ దారులు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మాఫియా బయట పడింది.మనం మాములుగా ఏదైనా తలనొప్పి, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలకు మెడికల్ షాపుకు వెళ్లి మందులు తెచుకుంటుంటాం.
కానీ ప్రజల అవసరాలను అక్రమ దారులు వాడుకుంటున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండానే వాళ్లకు నకిలీ మందులు సరఫరా చేస్తున్నారు.ఈ ఘటన గోదావరి జిల్లాల్లో బయట పడింది.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చుట్టూ ప్రక్కల ప్రాంతాలు, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నకిలీ మందుల వ్యాపారం సాగుతుంది.
మందు బిళ్ళల స్థానంలో సుద్దముక్కలు పెట్టి అమ్ముతున్నట్లు తెలియడంతో అధికారులు ఆ మందులను సీజ్ చేసారు.అక్రమార్కులు వీటిని మంచి ఆకర్షణీయ మైన ప్యాకింగ్, బ్యాచ్ నెంబర్లు వంటివి కూడా చూపించడంతో ప్రజలు వీటిని కొనుక్కుంటున్నారు.
అయితే ఈ మధ్య ఒక డ్రగ్ కంట్రోల్ అధికారి భీమవరంలో ట్యాబ్లెట్లను కొన్నాడు.వాటిని విజయవాడ ల్యాబ్ లో పరీక్షలు చేయించాడు.
ఈ పరీక్షలో వచ్చిన రిపోర్టును చూసి ఆ అధికారి షాక్ అయ్యాడు.ఒక్కో టాబ్లెట్ లో కనీసం 10 శాతం మందు కూడా లేదు.
అంతా సుద్దముక్కలే ఉన్నాయి.వీటిని ఉత్తరాఖండ్ కు చెందిన ఒక కంపెనీ తయారు చేసి సరఫరా చేస్తుందని అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ టాబ్లెట్స్ వాడితే లేని రోగాలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.ఇంకా ఈ మందులను ఎక్కడైనా విక్రయిస్తున్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.