1.ఆదిలాబాద్ కు ఆర్ ఎస్ ఎస్ చీఫ్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేపు అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
2.పాలిటెక్నిక్ కళాశాలలకు హై స్పీడ్ ఇంటర్నెట్
ఏపీ లోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని , ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
3.వికారాబాద్ లో చిరుత కలకలం

హైదరాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలంలో కలకలం సృష్టిస్తోంది.చెర్వు ముందలి తండాలో చిరుత మేకల మంద పై దాడి చేసి నాలుగు మేకలను హతమార్చింది.
4.ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు
ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలు, నక్సల్స్ కి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
5.నాగార్జున సాగర్ లో తరుణ్ చుగ్ పర్యటన
బిజెపి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఈ రోజు నాగార్జునా సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
6.ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిగా హరి ప్రీత్ సింగ్
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ డైరెక్టర్ జనరల్ హరి ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
7.జీవో 59 అమలకు సింగరేణి గ్రీన్ సిగ్నల్
సింగరేణి లో జీవో నెంబర్ 59 అమలు చేసేందుకు ఆ సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది.ఈ జీవో ప్రకారం ప్రభుత్వ పనిలో ఎస్సీ, ఎస్టీ, కాంట్రాక్టర్లకు 21 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
8.ఓటుకు నోటు కేసు వాయిదా

ఓటుకు నోటు కేసు తదుపరి విచారణ మార్చి 1వ తేదీకి ఏసీబీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
9.గుంటూరు జిల్లా నేతలతో అచ్చెన్న భేటీ
గుంటూరు జిల్లా టిడిపి నేతలతో గుంటూరు పార్టీ ఆఫీస్ ల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహిస్తున్నారు.
10.కృష్ణ జిల్లాలో లోకేష్ పర్యటన

కృష్ణ జిల్లా లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు.ఇటీవల హత్యకు గురైన పార్టీ కార్యకర్త సోమయ్య కుటుంబాన్ని , అలాగే మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ను లోకేష్ పరామర్శించనున్నారు.
11.రైల్వే మంత్రికి జగన్ లేఖ
రాష్ట్రంలో వివిధ రైల్వే పనుల అభివృద్ధిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.
12.నేడు కుప్పం లో బాబు పర్యటన
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు.
13.ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్సీ బోధన
ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యా బోధన చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
14.అమరావతి నిరసన దీక్ష లు

ఏపీ రాజధాని గా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిసర ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన నిరసన దీక్షలు నేటికీ 436 వ రోజుకి చేరుకున్నాయి.
15.మనబడి నాడు – నేడు పై జగన్ సమీక్ష

మనబడి నాడు నేడు పై ఏపీ సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.
16.కరోనా చెక్ పోస్ట్ లు
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చే అన్ని దారుల్లో కరోనా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నారు.ఈ మేరకు తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక కరోనా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు.
17.పదో తరగతి పరీక్షలేవ్ .అందరూ పాస్
తమిళనాడులో 9,10,11 వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.పరీక్షలు లేకుండానే వీరంతా పాస్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
18.వారానికి మూడు కోడిగుడ్లు
పుదుచ్చేరి, కారైక్కల్ తో పాటు, నాలుగు ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు వారానికి మూడు కోడి గుడ్లు అందించాలని ఆ రాష్ట్ర లెఫ్ట్నేంట్ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
19.హిమాచల్ ప్రదేశ్ లో రెండుసార్లు భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని చంభా ప్రాంతంలో గురువారం తెలావారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,400
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,350.