కరోనా వల్ల ఇక ప్రజలకు అంతలా ముప్పు లేదని సంబరపడుతున్న వేళ, ఊహించని షాక్ ఇస్తూ కోవిడ్ 19 సెకండ్ వేవ్ వ్యాపిస్తుంది.ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైందట.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణాలో స్కూళ్లను కూడా ఓపెన్ చేస్తున్నారు.అయితే కరోనా తగ్గలేదని నిరూపిస్తూ ఓ హాస్టల్ లో 200 మందికి పైగా విద్యార్ధులకు కరోనా సోకి కలకలం రేపుతుంది.
ఎక్కడో తెలుసుకుంటే.ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
కాగా గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయట.
అంతే కాదు కరోనా తగ్గిందని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే స్కూళ్లు, కాలేజీలకు కూడా అనుమతినిచ్చింది.
వాటితో పాటే హాస్టళ్లూ తెరుచుకున్నాయి.అయితే ఎక్కడ తేడా కొట్టిందో గానీ, 327 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఓ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు, సిబ్బందితో సహా 232 మందికి కరోనా సోకిందట.

అందులో ముగ్గురు సిబ్బంది, మిగతా వారంతా విద్యార్థులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించారు.చూశారా చదువులకని పిల్లలను పంపిస్తే ఇలా కరోనాను వెంటపెట్టుకు వస్తారు.అందుకే మరొక సారి పిల్లల చదువుల విషయంలో మిగతా రాష్ట్రాల అధికారులు కూడా ఒక్క సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండని కొందరు అనుకుంటున్నారట.