మార్కెట్లో బ్యాట్ పట్టుకొని ఐఏఎస్ కూతురు రచ్చ.. వీడియో వైరల్‌!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మాజీ ఐఏఎస్ కూతురు తెగ రెచ్చిపోయింది.తన ఇంటి ముందు రోడ్డు పక్కన దీపావళికి సంబంధించిన మట్టి కుండీలు, తదితర వస్తువులు అమ్ముకుంటుంటే ఆమె సహించలేదు.

 Ex Ias Officers Daughter Destroys Stalls With Bat In Uttar Pradesh Video Viral D-TeluguStop.com

అంతేకాదు ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పండుగల నేపథ్యంలో స్థానిక వ్యాపారులు తన ఇంటి ముందు దుకాణాలు పెట్టుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఘటన గోమతినగర్‌లోని పాత్రకర్‌పురంలో చోటుచేసుకుంది.

ఆ మహిళ మాజీ ఐఏఎస్ అధికారి శంకర్ లాల్ కూతురు అని, వృత్తి రీత్యా డాక్టర్ అని స్థానిక మీడియా వెల్లడించింది.స్థానిక ప్రజలు ఇక్కడ ఎలాంటి షాపులు పెట్టకూడదని ఆమె వారితో వాదించింది.

అలానే ఆ చిన్న షాపులను తొలగించాలని ఈ మహిళ హెచ్చరించింది.అయితే వారు లొంగకపోవడంతో, ఆమె మొదట వారిపై నీళ్లు పోసి, తర్వాత కర్రలతో వస్తువులు పగలగొట్టింది.

కాగా దుకాణదారులు, స్థానిక విక్రేతలు వాదిస్తూ, ప్రతి సంవత్సరం తాము స్టాల్స్‌ను ఇక్కడే ఉంచుతామని.తమ వస్తువులను పగలగొట్టడం అన్యాయమని వాపోవడం అన్నారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసామని పేర్కొన్నారు.

“మేడమ్ ఉదయం వచ్చి మా షాపులను తొలగించమని మాపై అరిచింది.అలానే వస్తువులపై నీరు కూడా పోసింది.ఆపై రోడ్డుపై ఏర్పాటు చేసిన బజార్‌ను సెకను వ్యవధిలో ధ్వంసం చేసింది.

బ్యాట్ తీసుకొచ్చి స్టాల్స్‌ను ధ్వంసం చేసింది.అయితే, ఎవరూ ఆమెకు ఒక్క మాట కూడా ఎదురుతిరిగి చెప్పలేదు” అని ఓ స్థానిక వ్యాపారి చెప్పారు.

కాగా దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఒక మాజీ ఐఏఎస్ కూతురు అయి ఉండి ఇలా చిన్న వ్యాపారుల పై దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube