సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల విలువైన స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.ఇతని పేరు కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.అలాగే టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతని పేరు కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా మారుమోగిపోయింది.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇదే విషయంలో సుకేష్ తో పాటు అతని సన్నిహితురాలు అయిన జాక్వెలిన్ పెర్నాండేజ్ పేరు కూడా మారుమోగిపోయింది.కాగా ఈ కేసు విషయంలో నోటీసులను కూడా అందించారు ఇది అధికారులు.
అంతే కాకుండా సుఖేష్ కేసు విషయంలో జాక్వెలిన్ పెర్నాండేజ్ ను ఇప్పటికే పలుసార్లు విచారణ కూడా చేశారు ఈడి అధికారులు.
విచారణలో భాగంగా సుఖేష్ నుంచి జాక్వెలిన్ పెర్నాండేజ్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా 12 కోట్ల వరకు బహుమతులను పొందినట్లుగా ఈడి అధికారులు తెలిపారు.అయితే ఇప్పటివరకు ఆమెనీ అరెస్టు చేయలేదు.కాగా ప్రస్తుతం ఆమె సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కేసు కు సంబంధించి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే సుఖేష్ చంద్రశేఖర్,జాక్వెలిన్ పెర్నాండేజ్ ను ఉద్దేశిస్తూ తన లాయర్ కు ఒక లెటర్ రాశాడట.
లెటర్ లో జాక్వెలిన్ పెర్నాండేజ్ అమాయకురాలు, ఆమె తన నుంచి బహుమతులు పొందిన మాట వాస్తవమే కానీ ఆ డబ్బు మొత్తం తాను కష్టపడి సంపాదించినది అని తెలిపాడు సుఖేష్ చంద్రశేఖర్.
స్కామ్ డబ్బు వేరే, పాన్ కార్డు చూపించిన డబ్బు వేరే అని తెలిపాడు సుఖేష్ చంద్రశేఖర్.తనకు కోల్ మైన్స్ ఉన్నాయని టీవీ చానల్స్ లో షేర్స్ కూడా ఉన్నాయని, అలా సంపాదించిన డబ్బుని కొంత జాక్వెలిన్ పెర్నాండేజ్ కోసం ఖర్చు చేసినట్టుగా సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖ లో తెలిపాడు.అప్పుడు ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమెకు ఆ బహుమతులు ఇచ్చినట్లు తెలిపాడు.
అయితే ఈ విషయంపై విచారణ జరిగితే మొత్తం స్పష్టం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు సుఖేష్ చంద్రశేఖర్.మొత్తానికి జైల్లోనే ఉంటూనే జాక్వెలిన్ పెర్నాండేజ్ ను కాపాడటం కోసం సుఖేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.
మరి అతని ప్రయత్నాలకు తగ్గట్టుగా ఆమె ఈ కేసు నుంచి బయట పడుతుందో లేదో చూడాలి మరి.