ఇటీవల సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) మరోసారి ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే మోదీ( Modi ) ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్యలతో తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయి న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందిన రాహుల్ గాంధీ ఇప్పుడు మరోసారి అదే తరహా వ్యాఖ్యలు మోదీపై చేసి కీలకమైన ఎన్నికల సమయంలో కొత్త ఇబ్బందులు తెచ్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే ఇండియా ,ఆస్ట్రేలియా( India, Australia ) ల మధ్య జరిగిన వరల్డ్ కప్పు మ్యాచ్ తర్వాత రాజస్థాన్ లోని ఎన్నికల ప్రచారం లో బాగం గా జరిగిన ఒక సభ లో మాట్లాడిన రాహుల్ గాంధీ ఆరోజు ఫైనల్ మ్యాచ్కు హాజరైన వారిలో ఒక అపశకునం కూడా ఉందని, ఆ అపశకునం వల్లే భారత్ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.అదే సందర్భంలో మోది ని ఉద్దేశించి పనోటి అన్న పద ప్రయోగాన్ని చేశారు.దాంతో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన భాజపా శ్రేణులు రాహుల్ గాంధీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.బజాపా ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్ ( Radha Mohandas Aggarwal )మరో నేత ఓం ప్రకాశ్ పాటక్( Om Prakash Pathak ) తో సహా కొంతమంది ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే( Mallikarjun Kharge ) మరియు రాహుల్ గాంధీ అసత్యాలను వ్యాప్తి చేస్తున్నారని, వారి ప్రవర్తన నైతిక ప్రవర్తన నియమాలని ఉల్లంఘిస్తున్నందున చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు.
దానిపై స్పందించిన ఈసీ రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

రేపు సాయంత్రం లోగా తమ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఈసీ కోరినట్లుగా తెలుస్తుంది.మరి రాహుల్ గాంధీ పై ఈసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది.ఏది ఏమైనా రాహుల్ గాంధీ కేంద్రంగా భాజాపా పన్నిన వలలో రాహుల్ గాంధీ ఈజీగా పడిపోయారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరి ఈ వాఖ్యలకు కాంగ్రెస్ ఏ విధమైన మూల్యం చెల్లిస్తుందో చూడాలి.