ఈ ప‌క్షులు ఎక్క‌డ గూడు పెడుతాయో తెలిస్తే షాక్ అవుతారు..

జనరల్‌గా పక్షులు చెట్లపైన, కొమ్మల మధ్యనో లేదా ఏదేని సేఫ్ ప్లేస్ అనిపించే చోటనో గూడు కట్టుకుంటుండటం మనం చూడొచ్చు.అలా గూడు కట్టుకుని పక్షులు గుడ్లు పెడుతుంటాయి.

 Drone Visual Of Flamingoes' Vast Nesting Area In Rann Of Kutch Takes Internet By-TeluguStop.com

ఇది సాధారణ విషయమే.కానీ, ఇక్కడ ఈ పక్షులు కట్టుకునే గూడులు మాత్రం వెరీ స్పెషల్.

ఈ బర్డ్స్ ఎక్కడ గూడు పెడతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఇంతకీ ఆ పక్షులు ఏవంటే.

ఫ్లెమింగో పక్షులు.

ఈ ఫ్లెమింగో బర్డ్స్.ఇసుకతో గూళ్లు కట్టుకుని అక్కడ గుడ్లు పెడుతాయి.వేరే ఇతర ఏ పక్షులైనా కొమ్మల నడుమ గుడ్లు పెడుతుంటాయి.అలా అక్కడే గూడు కట్టుకుంటుంటాయి.కానీ, ఫ్లెమింగో పక్షులు మాత్రం ఎడారిలో ఇసుకను పోగు చేసుకుని మరీ గూడుగా మార్చుకుని గుడ్లు పెడతాయి.

అలా గుజరాత్ ‌లోని రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో ఫ్లెమింగ్ పక్షులు ఇసుకతో పెట్టిన గూళ్లకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.సదరు వీడియోను ట్విట్టర్ వేదికగా జర్నలిస్ట్ జనక్ దేవ్ పోస్ట్ చేశాడు.

Telugu Drone, Dronevisual, Flamingoes, Rann Kutch-Latest News - Telugu

ఇక ఆ వీడియో చూసి నెటిజన్లు వావ్.అంటున్నారు.ఫ్లెమింగో పక్షులు కట్టుకున్న గూళ్లు చూడటానికి చీమల పుట్టల్లాగానే ఉన్నాయి.ప్రతీ గూడుపైన ఓ గుడ్డు ఉంది.ఆ గూళ్లపై నుంచి డ్రోన్ ముందుకు సాగుతున్న క్రమంలో.వీడియో రికార్డు అయింది.

పెద్ద కొంగల లాగా ఉండే ఈ ఫ్లెమింగోల ఫుటేజీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఫ్లెమింగోల గూళ్ల వీడియో వింతగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాన్ ఆఫ్ కచ్ టూరిజం పరంగా చాలా ఫేమస్.ఫ్లెమింగోలు శీతాకాలంలో ఈ ప్రాంతంలోకి వచ్చి గుడ్లు పెడతాయని జర్నలిస్ట్ జనక్ దేవ్ తన పోస్టులో వివరించాడు.

తెల్లని ఎడారిగా ఉండే ఈ ప్రాంతం చాలా ఫేమస్ ప్లేస్.ఈ ప్లేస్ ను చూసేందుకుగాను పర్యాటకులు వస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube