నిర్లక్ష్యమో, మతిమరపో తెలీదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట వైద్యుల నిర్వాకం బయటపడుతుంది.కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించిన కడుపులో కత్తెర మరిచిపోయన ఘటన మరవకముందే.
సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ఇదే తరహా ఘటన జరిగింది.కాకపోతే అక్కడ కత్తెర మరచిపోతే… ఇక్కడ దూది మరిచిపోయారు.
వివరాల లోకి వెళ్తే…సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రానికి చెందిన జంగిటి స్వప్న ఫిబ్రవరి 13న కాన్పుకోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో చేరింది.పరేషన్ చేసి డెలివరీ చేశారు.
ఆ సమయంలో స్వప్నకు తీవ్ర రక్తస్రావం కావడంతో దానిని ఆపేందుకు దూది ఉండను అమర్చారు వైద్యులు.అయితే ఆ దూది ఉండను తీయకుండానే కుట్లు వేశారు.

కొద్ది రోజులకు స్వప్నకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కడుపులో ఏదో ఉండలాంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు.వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి దానిని తొలగించారు.