అంతరిక్షంలో బట్టలుతికితే ఏమవుతుందో తెలుసా?

సామాన్య మధ్య తరగతి ప్రజలంతా బట్టలు ఉతుక్కోవడం చేస్తుంటారు.చాలా వరకు వారివి, వారి కుటుంబ సభ్యులవి వాళ్లే ఉతుక్కుంటూ ఉంటారు.

 Do You Know What Happend If You Wash Clothes In Space Details, Wash Towel In Spa-TeluguStop.com

కాస్త ఎగవ మధ్య తరగతి వారైతే వాషింగ్ మిషన్లు వాడుతారు.మనం బట్టలు ఉతికితే నురగ రావడం సహజం.

ఎందుకంటే అందులో మనం సబ్బు లేదా సర్ఫ్ వంటివి వాడుతుంటాం కాబట్టి.అయితే అదే అంతరిక్షంలో బట్టలు ఉతికితే ఏమవుతుందనే అనమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా.

అలా చేస్తే అసలు ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అంతరిక్షంలో గురుత్వాకరణ శక్తి ఉండదు.

అక్కడ భూమి మీద జీవించినట్లు జీవించడం కూడా కుదరదు.అందుకే అంతరిక్షంలో నివసించే వ్యోమగాములు జీవితానికి సంబంధించిన ఏదైనా మనకు వింతగానే ఉంటుంది.

అయితే కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి క్రిస్ హాడ్ ఫీల్డ్ ఐఎస్ఎస్ వద్ద తడి టవల్ తో చేసిన సాధారణ ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియోను నాసా విడుదల చేసింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోను వాస్తవానికి 2013లోనే నాసా విడుదల చేసింది.కానీ అదిప్పుడు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది.

అంతరిక్షంలో తేలుతున్నప్పుడు తడి టవల్ ని బయటకు తీస్తే ఇది జరుగుతుందనే శీర్షికతో వండర్ ఆఫ్ సైన్స్ పేజీ ద్వారా దీన్ని ట్వీట్ చేశారు.క్రిస్ తడి బట్టని తీస్కొని రెండు చేతులతో పిండుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.గురుత్వాకరణ శక్తి లేకపోవడం వల్ల టవల్ నుంచి వచ్చే నీరు నేలపై పడదు.బదులుగా అది దాని చుట్టూ ట్యూబ్ ని ఏర్పరుస్తుంది.అయితే ఈ వీడియోను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube