ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్ బుక్‌కు విశ్వవ్యాప్తంగా యూజర్లు ఉన్న సంగతి తెలిసిందే! ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్ కూడా ఉపయోగించడం చాలా సులభం.కానీ, మీకు తెలియని మరిన్ని ఫీచర్స్ ఫేస్‌బుక్‌లో ఉన్నాయి.అవెంటో తెలుసుకుందాం.
స్పాటిఫై మినిప్లేయర్…
ఫేస్‌బుక్ స్పాటిఫై ప్రీమియం మెంబర్స్‌కు తమ స్థానిక భాషలో మ్యూజిక్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులిద్దరికీ అందుబాటులో ఉంది.మీరు స్పాటిఫై ఫ్రీ కస్టమర్లు అయితే షఫుల్ మోడ్ ద్వారా ఈ ఫీచర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.ఫేస్‌బుక్‌లో మనకు నచ్చిన వారికి ఇష్టమైన పాటను షేర్ చేయవచ్చు.
మెసేజ్ రిక్వెస్ట్స్…
ఫేస్‌బుక్ వినియోగించేటపుడు మెసేజ్ వ్యూ ఫోల్డర్ ద్వారా మెసేజెస్ రిక్వెస్ట్ పంపించవచ్చు.ఫేస్‌బుక్ ద్వారా మెసేజెస్ యాక్సెస్ చేయడానికి మెసేంజర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.ఫుల్ స్క్రీన్‌లో కూడా చూడటానికి కింది భాగంలో ఉండే ‘సీ ఆల్ మెసేంజర్’పై క్లిక్ చేయాలి.
మూడు చుక్కలపై క్లిక్ చేసి.మెసేజ్ రిక్వెస్ట్‌ను సెలెక్ట్ చేస్తే చాలు మీకు ఫ్రేండ్ కాని వారి మెసేజ్‌లు కనిపిస్తాయి.

రిస్ట్రిక్ట్ ఫ్రేండ్స్…
ఫేస్‌బుక్‌లో ఉండే మరో ఫీచర్ కేవలం మీకు కావాల్సినవారే మీ పోస్టులను చూసే విధంగా నియంత్రించవచ్చు.ఇందులో మూడు ఆప్షన్స్ ఉంటాయి.దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.ఈ ఫీచర్‌ను నియంత్రించడానికి ప్రోఫైల్ పేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది.అందులో ఎవరినైనా రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంటుంది.కుడివైపు మూడు చుక్కలను క్లిక్ చేస్తే.
ఫ్రెండ్స్ ఆన్ మొబైల్‌ను సెటెక్ట్ చేసి, ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఎడిట్ చేసిన తర్వాత రిస్ట్రిక్ట్ చేయవచ్చు.

ఈజీగా అన్‌ఫాలో అవ్వచ్చు…
ఫేస్‌బుక్ ద్వారా మీరు అన్‌ఫ్రెండ్ అవ్వకుండానే.అన్‌ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది.న్యూస్ ఫీడ్‌లో ‘అన్‌ఫాలో’ అవ్వడం సులభం.
మీకు కావాల్సినపుడు మార్చుకుంటే సరిపోతుంది.దీన్ని యాక్టివేట్ చేయడానికి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లిన తర్వాత న్యూస్ ఫీడ్ ప్రిఫరెన్సెస్‌లో రీకనెక్ట్ చేస్తే సరిపోతుంది.
ఫేస్‌బుక్‌లో ఎంతసేపు గడిపారో తెలుసుకోవచ్చు.
ప్రతిరోజూ మీరు ఫేస్‌బుక్‌లో ఎంతసేపు గడిపారో సులభంగా తెలుసుకోవచ్చు.దీనికి హంబర్గర్ మెనులోకి వెళ్లి సెట్టింగ్ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.అందులో యువర్ టైం ఆన్ ఫేస్‌బుక్‌ను సెలెక్ట్ చేయాలి.అందులో బార్ చాట్ కనిపిస్తుంది.మీరు ఎంతసేపు ఫేస్‌బుక్‌ను వాడారో తెలుస్తుంది.