నాచురల్ స్టార్ నాని హీరోగా రీతువర్మ హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంటక్ జగదీష్ ఈ సినిమా కరోనా రెండో దశ రాకముందే షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే విడుదలకు సిద్ధంగా ఉండి విడుదల తేదీని కూడా ప్రకటించిన సమయంలో కరోనా కేసులు అధికం కావడం చేత ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
గతంలో ఈ సినిమా థియేటర్లో కాకుండా
ఓటీటీలో విడుదల కాబోతుందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తమ సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుందని సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని టక్ జగదీష్చి త్రబృందం ఆ వార్తలను ఖండించారు.
అయితే ప్రస్తుతం థియేటర్లు తెరుచుకొని సినిమాలు విడుదలవుతున్నప్పటికీ నాని సినిమా విడుదల గురించి ఏమాత్రం సమాచారం లేదు.తాజాగా అందిన సమాచారం మేరకు నాని నటించిన టక్ జగదీష్చి త్రం ఓటీటీలో విడుదల కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకున్నప్పటికీ టికెట్ల ధరలు లేక పోవడం చేత నిర్వాహకులు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నుంచి టక్ జగదీష్ చిత్రంతో డీల్ కుదుర్చుకుందని, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం కోసం ఏకంగా 45 కోట్లు ఆఫర్ చేయడంతో ఈ సినిమా థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి నిర్వాహకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.అయితే చిత్రబృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.అదే విధంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం పై స్పందించాల్సి ఉంది.ఇకపోతే నానిశ్యామ్ సింగరాయ్సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.