వాట్సాప్‌లో మీ చాట్‌ను శాశ్వతంగా ఎలా హైడ్‌ చేయాలో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందించడంలో ముందు వరుసలో ఉంటుంది.అయితే, వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్న మరిన్ని ఫీచర్లు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.

 Do You Know How To Hide Whatsapp Chats, Whats App Chat, Whats App Conversion, Hi-TeluguStop.com

ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో మీరు ఎవరితోనైనా చాట్‌ చేస్తే.అది ఇతరులకు కనిపించకుండా పర్మినెంట్‌గా ఎలా హైడ్‌ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాట్సాప్‌లో ఉన్న అద్భుతమైన ఫీచర్లలో చాట్‌ హైడ్‌ కూడా ఒకటి.దానే ‘అర్చీవ్‌’ అని అంటారు.

కొంత మందికి వాట్సాప్‌ హైడ్‌ చాట్‌ ఆప్షన్‌ తెలియక, వాటిని డిలీట్‌ చేస్తారు, లేదా ఎస్డీ కార్డుకు బ్యాకప్‌ చేస్తారు.కానీ, ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లోనే మన చాట్‌ హైడ్‌ అయి ఉంటుంది.

వాట్సాప్‌ చాట్‌ను తాత్కాలికంగా హైడ్‌ చేయడం.

– దీనికి మీకు కావాల్సిన చాట్‌ను ఎంచుకుని, దానిపై లాంగ్‌ ప్రెస్‌ చేయాలి.అప్పుడు అర్చీవ్‌ బాక్స్‌ యాప్‌ పై భాగంలో కనిపిస్తుంది.– బాక్స్‌పై క్లిక్‌ చేస్తే, చాట్‌ హైడ్‌ అయిపోతుంది.

గమనిక.

మీరు ఎంచుకున్న చాట్‌ పర్సనల్‌ అయిన గ్రూప్‌ అయిన కొత్త మెసేజ్‌లు వచ్చినా, అవి అర్చీవ్‌ అయిపోతాయి.దీనికి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్‌ రాదు.దీనికి మీరు అర్చీవ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది.

Telugu Whatsapp Chat, Whats App Chat, Whats App, Whatsapp-Latest News - Telugu

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో హిడెన్‌ చాట్‌ను అన్‌డూ చేయడం.

– దీనికి చాట్‌ ఆప్షన్‌లో పూర్తిగా కిందికి స్క్రోల్‌ చేయాల్సి ఉంటుంది.– అప్పుడు మీకు అర్చీవ్‌ సెక్షన్‌ కనిపిస్తుంది.దానిపై క్లిక్‌ చేస్తే.మీకు అన్ని హిడెన్‌ ఫైల్స్‌ కనిపిస్తాయి.– మీకు హిడెన్‌ చాట్స్‌ అన్ని కనిపించాలి అంటే.ఆ చాట్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి, మళ్లీ అర్చీవ్‌ బాక్స్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

వాట్సాప్‌లో చాట్‌ను శాశ్వతంగా హైడ్‌ చేసే విధానం.

Telugu Whatsapp Chat, Whats App Chat, Whats App, Whatsapp-Latest News - Telugu

దీనికి ‘కీప్‌ చాట్స్‌ అర్చీవ్డ్‌’ అనే ఆప్షన్‌ను ఆన్‌ చేయాల్సి ఉంటుంది.ఈ ఫీచర్‌ సెట్టింగ్స్‌లో ఉంటుంది.సెట్టింగ్స్‌లో చాట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఆ తర్వాత కీప్‌ చాట్స్‌ అర్చీవ్డ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.ఒక్కసారి ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేస్తే ప్రతిరోజూ మీకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లు ఎప్పటికీ హైడ్‌ అవుతూనే ఉంటాయి.కానీ, దీన్ని గుర్తించడానికి టాప్‌లో అర్చీవ్డ్‌ బాక్స్‌ కనిపిస్తుంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో అర్చీవ్డ్‌ బాక్స్‌ను తొలగించడం…

వాట్సాప్‌లోని అర్చీవ్డ్‌ బాక్స్‌ను టాప్‌ చేయాలి.అప్పుడు అన్నీ అర్చీవ్డ్‌ చాట్స్‌ కనిపిస్తాయి.

ఆ తర్వాత కుడివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.అర్చీవ్డ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

అప్పుడు ‘ కీప్‌ చాట్స్‌ అర్చీవ్డ్‌’ను డిసేబుల్‌ చేస్తే, చాట్‌ పై భాగంలో ఉండే అర్చీవ్డ్‌ బాక్స్‌ డిసాపియర్‌ అయిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube