తమిళనాడు రాజకీయాల్లో సినిమా సందడి... స్టార్స్ అందరూ ఒకే దారి

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమా స్టార్స్ తో కళకళలాడుతుంది.చాలా రోజుల తర్వాత మరల వారి ఆధిపత్యం కనిపిస్తుంది.

 Star Hero's Enter In Tamil Political Space, Kollywood, Dmk, Aidmk, Kamal Hassan,-TeluguStop.com

నిజానికి తమిళనాడులో ప్రాంతీయ రాజకీయాలు మొదలైంది సినిమా స్టార్స్ తోనే అనేది చాలా మంది నమ్ముతారు.ఎంజీ రామచంద్రన్ నుంచి మొదలు పెడితే తమిళనాడుని ఇంతకాలం ఏలిన జయలలిత, కరుణానిధి మృతి చెందిన తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

అన్నాడిఎంకే జయలలిత స్నేహితురాలు శశికళ ఆధిపత్యంలోకి వచ్చింది.ఇక డిఎంకే కరుణానిధి వారసులైన స్టాలిన్ ఆధిపత్యంలోకి వచ్చింది.

ఇప్పుడు తమిళ రాజకీయాలలో చక్రం తిప్పాలని వీరిద్దరు బలంగా కోరుకుంటున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న గ్యాప్ ని అవకాశంగా తీసుకొని మరో సారి తమిళ రాజకీయాలపై సినిమా వాళ్ళు ఆధిపత్యం చేయడానికి రెడీ అయిపోయాడు.

ఇప్పటికే ఈ దారిలోకి కమల్ హసన్ ఎంఎన్ఎం పార్టీతో వచ్చేశారు.తన రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టి ముందుకి వెళ్ళిపోతున్నారు.

ఇక రజినీకాంత్ పార్టీ పెట్టకపోయిన ఇప్పటికే తన రాజకీయానికి పునాదులు వేసుకున్నారు.క్యాడర్ మొత్తాన్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికల ముందు పార్టీ పెడతారనే చర్చ నడుస్తుంది.అయితే తమిళనాడులో ఒక వర్గం నుంచి రజినీకాంత్ కి వ్యతిరేకత వస్తుంది.

తమిళ వ్యక్తి కాని రజినీకాంత్ ఎలా తమిళ రాజకీయాలలోకి వస్తాడని ప్రశ్నిస్తున్నారు.మరో వైపు స్టార్ హీరో అజిత్ పేరు కూడా తమిళ రాజకీయాలలో భాగా వినిపిస్తుంది.

అమ్మ జయలలిత తన వారసుడుగా అజిత్ ని ప్రకటించే సమయానికి ఆమె చనిపోయిందని, కచ్చితంగా అజిత్ అన్నాడిఎంకేలోకి ఎంట్రీ ఇవ్వడం కాని లేదంటే జయలలిత పేరుతో సొంత పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందనే మాట చాలా కాలంగా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది.

బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే విధంగా విజయ్ రాజకీయ ప్రవేశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల బట్టి విజయ్ ఏదో ఒక పార్టీలో చేరకుండా సొంతగా పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారని చర్చించుకుంటున్నారు.

మరి రానున్న రోజుల్లో ఈ తమిళ నాడు రాజకీయాలలో సినిమా స్టార్స్ సందడి ఎంత వరకు ప్రభావం చూపుతుందో అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube