డీకే తుపాన్‌ ఇన్నింగ్స్‌లు.. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఛాన్స్‌ కోసమేనా..?!

సోమవారం నాడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) తో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు తలపడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్‌ 25 పరుగులతో విజయం సాధించింది.

 Dk Tupan's Innings For A Chance In The T20 World Cup Team, Dinesh Karthik, Rcb,-TeluguStop.com

ఇకపోతే ఆకాశమే హద్దుగా ఎస్‌ఆర్‌హెచ్‌, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బ్యాట్స్మెన్స్ రెచ్చిపోయి పరుగులను రాబట్టారు.ఈ సీజన్లోనే అత్యధిక పరుగుల రికార్డును సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌ మరోసారి వారి రికార్డును వారే తిరగరాసుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 287 భారీ స్కోరును సాధించింది.ఇక కొండంత భారీ లక్ష్య చేధనను మొదలుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట వికెట్ పడకుండా బాగానే పరుగులు రాబట్టిన ఒకానొక సమయంలో వరుసగా 5 వికెట్లను కోల్పోవడంతో పూర్తిగా మ్యాచ్ సన్ రైజర్స్ వైపు మళ్లీంది.

Telugu Dinesh Karthik, Dktupans, Ipl, Cup-Latest News - Telugu

కాకపోతే తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దినేష్ కార్తీక్ ( Dinesh Karthik ) ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో.రాయల్ చాలెంజ్ బెంగుళూరు కూడా మంచి స్కోరును చేయగలిగింది.దినేష్ కార్తీక్ తన ట్రేడ్ మార్క్ షార్ట్స్ తో అలరించాడు.చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అతనికి ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాక తల పట్టుకుంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ లోని ఫ్యాట్ కమిన్స్, భువనేశ్వర్ ( Bhubaneswar )లాంటి సీనియర్ బౌలర్లు కూడా దినేష్ ఏ మాత్రం కనికరం చూపించకుండా.కేవలం 35 బంతులలోనే 83 పరుగులను రాబట్టాడు.

అతడి వీరోచిత ఇన్నింగ్స్ కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి పోటీని ఇవ్వగలిగింది.

Telugu Dinesh Karthik, Dktupans, Ipl, Cup-Latest News - Telugu

ఇకపోతే రాయల్ చాలెంజ్( Royal Challeng ) బెంగుళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ ఈ సీజన్ లో అద్భుతంగా పరుగులు రాబడుతున్నాడు.ముఖ్యంగా మ్యాచ్ చివర్లో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు మంచి ఫినిషింగ్ ఇచ్చి స్కోరును స్కోరుబోర్డుపై పరుగులు పెట్టిస్తున్నాడు.ఈ క్రమంలో దినేష్ కార్తీక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆర్సిబి మ్యాచ్ గెలవకపోయినా డీకే మాత్రం క్రికెట్ అభిమానుల మనుషులను గెలుచుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు కనపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్ తర్వాత జరగబోయే టి20 వరల్డ్ కప్ కు దినేష్ కార్తీక్ ఎంపిక చేయాలంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.

చూడాలి మరి అభిమానుల కోరిక మీదకైనా బీసీసీఐ దినేష్ కార్తీక్ ను టి20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేస్తుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube