మహేష్‌ 25 అంచనాలు తారు మారు.. వంశీ కేక పుట్టించాడు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ నేడు మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేయడం జరిగింది.

 Director Vamshi Paidipally Surprises Mahesh 25th-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రిషి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది.అయితే అది మహేష్‌బాబు పాత్ర పేరు అని, సినిమాకు ‘మహర్శి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ఫస్ట్‌లుక్‌ విడుదలతో క్లారిటీ వచ్చేసింది.

మహేష్‌బాబు 25వ చిత్రం టైటిల్‌ గురించి గత మూడు నాలుగు రోజుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టిన దర్శకుడు వంశీ అందరి అంచనాలను తారు మారు చేశాడు.ఎక్కడ కూడా లీక్‌ కాకుండా మహర్షి టైటిల్‌ను గుట్టుగా ఉంచడం వంశీకే సాధ్యం అయ్యింది.రిషి అక్షరాలు షేర్‌ చేయడం వల్ల టైటిల్‌ రుషి అయ్యి ఉంటుందని అంతా అనుకోవడం జరిగింది.కాని దర్శకుడు వంశీ ఏమాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పర్చకుండా, ఫ్యాన్స్‌ను ఆనందపర్చుతూ టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.

25వ చిత్రం అనగానే ఏ హీరో అభిమానుల్లో అయినా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి.అలాగే మహేష్‌బాబు 25వ మూవీ విషయంలో కూడా ఫ్యాన్స్‌ అంతే అంచనాలు పెంచుకుని ఉన్నారు.

అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

ఫస్ట్‌లుక్‌ మరియు టైటిల్‌ విషయంలో చేసినట్లుగా సినిమా విషయంలో కూడా దర్శకుడు ఫ్యాన్స్‌ అంచనాలను తారు మారు చేయాలని, సినిమా భారీ విజయాన్ని దక్కించుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది.ఇక ఇదే సినిమాలో అల్లరి నరేష్‌ ఒక కీలక పాత్ర పోషించడం హైలైట్‌గా నిలవబోతుంది.

ముగ్గురు ప్రముఖ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం కూడా ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube