ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న కానిస్టేబుల్ రాసిన వింత లీవ్ లెటర్.! సెలవు ఎందుకు కావాలన్నాడంటే.?

లీవ్ లెటర్.స్కూల్ లో ఉన్నప్పుడు రాయడమే తప్ప తరవాత దానితో మనకి పెద్ద అవసరం పడలేదు అనుకుంట.

 A Police Constable Leave Application Is Viral On Facebook-TeluguStop.com

స్కూల్ కి వెళ్లలేకపోతే రకరకాల కారణాలు చెప్పి లీవ్ లెటర్ రాసే వాళ్ళం.ఎక్కువగా కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం అని రాసేవాళ్ళు.

ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో అంటే లీవ్ లెటర్ లతో పెద్దగా పరిచయం లేదు ఎందుకంటే అన్ని మెయిల్ లోనే జరిగిపోతాయి.కానీ కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికి సెలవు కావాలంటే పై అధికారులకు లీవ్ లెటర్ రాయాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్ సెలవు కోరుతూ రాసిన లేఖ మాత్రం వైరల్ గా మారింది.దానికి కారణం అతను లీవ్ లెటర్ లో సెలవు కోరుతూ రాసిన కారణం.

బులంద్‌షహర్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వినోద్ కుమార్ ఈ నెల 5న సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అందులో.నాకు శివుడు కలలో కనిపించాడు.నీటితో నిండిన కమండలం ఆకారంలో దర్శనిమిచ్చాడు.దాని చుట్టూ సర్పాలు తిరగడాన్ని కూడా గమనించాను.దేవుడు తనకు జలాభిషేకం చేయడానికి హరిద్వార్ రమ్మన్నాడు.

భగవంతుడి కోరిక నెరవేర్చేందుకు ఆరు రోజులు సెలవు కావాలని లేఖలో ప్రస్తావించాడు.విచిత్రం ఏమిటంటే ఈ దరఖాస్తును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఆరు రోజులు సెలవు కూడా ఇచ్చారు.

వినోద్ కుమార్ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దేవుడు కలలో కనపడటం.జలాభిషేకం చేయమని అడగాడని చెప్పడం.అధికారులు సెలవులు మంజూరు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube