పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను రియిమ్ బర్స్ వెంటనే విడుదల చేయాలి విద్యార్థులకు సరిపడే గదులను వెంటనే నిర్మించాలి.ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలింపు వికారాబాద్ జిల్లా తాండూర్ డివిజన్ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు .
దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి గంట పాటు నిర్వహించిన ధర్నాలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవని అలాగే సరిపడా నిధులు కాంపౌండ్ వాల్ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు అంతేకాక విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు