రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాపై ( Deavar movie )ఆకాశమే హద్దుగా అంచనాలు పెరగగా ట్రైలర్ లో కథ కొత్తగా లేదనే కామెంట్లు వినిపిస్తున్నా కొరటాల శివ ( Koratala Shiva )కావాలనే అలా ట్రైలర్ ను కట్ చేయించి ఉండవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు ఈ సినిమాకు సంబంధించి అర్ధరాత్రి నుంచి షోలు ప్రదర్శితం కానున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు లభించాయని తెలుస్తోంది.
నైజాంలోని మల్టీప్లెక్స్ లలో 413 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 250 రూపాయలుగా దేవర టికెట్ రేట్లు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.ఏపీ విషయానికి వస్తే మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.325( multiplex theaters Rs.325 ), సింగిల్ స్క్రీన్లలో రూ.200గా టికెట్ రేట్లు ఉండనున్నాయని తెలుస్తోంది.అయితే అధికారికంగా ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.దేవర మేకర్స్ స్పందిస్తే మాత్రమే వైరల్ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.

బెనిఫిట్ షోలు, స్పెషల్ షోల టికెట్ రేట్లు మరింత ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.2024 సంవత్సరం దేవర నామ సంవత్సరం అని మేకర్స్ చెబుతుండగా మేకర్స్ నమ్మకం ఎంతమేర నిజం అవుతుందో చూడాల్సి ఉంది.దేవర సినిమా అదిరిపోయే క్రేజీ ట్విస్టులతో ఉండనుందని ప్రచారం జరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్నారు.మిగతా హీరోలకు భిన్నంగా ఈ హీరో కథలను ఎంచుకుంటున్నారు.తారక్ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న రికార్డులు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
దేవర సినిమాకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు.దేవర సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా రేంజ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.