ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్( Darsi MLA Maddishetty Venugopal ) తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు.తనకు వైసీపీ టికెట్( YCP Ticket ) ఇవ్వకున్నా ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు.
తన అనుచరులను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి( Buchepalli Siva Prasad Reddy ) టార్గెట్ చేశారని మద్దిశెట్టి వేణుగోపాల్ ఆరోపించారు.అంతేకాకుండా తన అనుచరులపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు.
అయితే తన అనుచరులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మద్దిశెట్టి భరోసా ఇచ్చారు.
అయితే దర్శి సీటును వైసీపీ అధిష్టానం శివప్రసాద్ రెడ్డికి కేటాయించగా.మద్దిశెట్టి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.దర్శి అసెంబ్లీ సీటు కాకపోతే ఒంగోలు ఎంపీ సీటు( Ongole MP Seat ) అయినా ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు.
అయితే దానికి కూడా వైసీపీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆయన అసమ్మతితో రగిలిపోతున్నారు.