అనుచరులతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి కీలక సమావేశం
TeluguStop.com
ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్( Darsi MLA Maddishetty Venugopal ) తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు.
తనకు వైసీపీ టికెట్( YCP Ticket ) ఇవ్వకున్నా ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు.
తన అనుచరులను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి( Buchepalli Siva Prasad Reddy ) టార్గెట్ చేశారని మద్దిశెట్టి వేణుగోపాల్ ఆరోపించారు.
అంతేకాకుండా తన అనుచరులపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు.అయితే తన అనుచరులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మద్దిశెట్టి భరోసా ఇచ్చారు.
"""/" /
అయితే దర్శి సీటును వైసీపీ అధిష్టానం శివప్రసాద్ రెడ్డికి కేటాయించగా.
మద్దిశెట్టి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.దర్శి అసెంబ్లీ సీటు కాకపోతే ఒంగోలు ఎంపీ సీటు( Ongole MP Seat ) అయినా ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు.
అయితే దానికి కూడా వైసీపీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆయన అసమ్మతితో రగిలిపోతున్నారు.
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ రిలీఫ్… హై కోర్ట్ సంచలన తీర్పు!