కొరియోగ్రాఫర్ చైతన్య(Chaitanya) మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి.అప్పుల బాధలు తట్టుకోలేక ఈయన ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటూ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆత్మహత్యకు గల కారణాలను తెలియజేశారు.
ఇక చైతన్య ఆత్మహత్య గురించి పలువురు స్పందిస్తూ సంతాపం ప్రకటించారు ఈ క్రమంలోనే ఆట సందీప్ ( Aata Sandeep) సైతం చైతన్య మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సూసైడ్ వీడియోలో చైతన్య ఢీ షో(Dhee Show) లో రెమ్యూనరేషన్ (Remuneration) తక్కువగా ఇస్తున్నారు అంటూ తెలియచేశారు.
ఈ విషయం గురించి సందీప్ మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

ఏదైనా ఒక కార్యక్రమం మొదలు కావాలన్నా ఆ కార్యక్రమం పూర్తి కావాలన్నా మొదటి నుంచి చివరి వరకు డాన్సర్లు కావాల్సిందేనని తెలియజేశారు.అయితే ప్రొడక్షన్ వారికి మాత్రం డాన్సర్స్ అంటే చాలా చిన్న చూపు అని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.సింగర్ ఒక్కరే వచ్చే స్టేజ్ పై పర్ఫామెన్స్ చేస్తారు.
వారికి అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు కానీ డాన్స్ చేయాలి అంటే ఒక కొరియోగ్రాఫర్ దాదాపు 20 మంది డాన్సర్లను మాట్లాడుకోవాల్సి ఉంటుంది.వారికి ఇవ్వాల్సిన పేమెంట్ తో పాటు కాస్ట్యూమ్ ఖర్చులు కూడా ప్రొడక్షన్ వారు ఇచ్చే డబ్బుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఇలా ఒక డాన్స్ చేయాలంటే భారీగా ఖర్చులు అవుతాయి కానీ ప్రొడక్షన్ వారు ఆ విషయాలను గుర్తు పెట్టుకోవడం లేదని ఇక ఈ విషయాలను కనుక మనం వారికి చెబితే గంటల తరబడి పేమెంట్ కోసం బేరాలు ఆడతారని, డాన్సర్లను చిన్నచూపు చూస్తారని తెలిపారు.ఇలా ఒక పర్ఫామెన్స్ చేయాలి అంటే ప్రొడక్షన్ వారు ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోక బయట నుంచి అప్పులు చేయాల్సిన పరిస్థితి కొరియోగ్రాఫర్లకు ఏర్పడుతున్నాయని ఆట సందీప్ తెలియచేశారు.ఇలా చైతన్య లాగా మరొక డాన్సర్ ఆత్మహత్య చేసుకోకూడదు అంటే కొరియోగ్రాఫర్లకు ఇచ్చే పేమెంట్ గురించి ప్రొడక్షన్ టీం మరొకసారి ఆలోచించి వారి కష్టానికి తగ్గ రెమ్యూనరేషన్ ఇస్తే మంచిది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.