భారతదేశ రాజకీయాలలో ఒకప్పుడు అద్భుతమైన వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు( Communist party ) క్రమంగా వాటి ప్రభను కోల్పోయాయి .ముఖ్యంగా ఉద్యమాలు అంటే కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ప్రజలకు గుర్తు వచ్చేవి.
ధరలు పెరుగుతున్నప్పుడు భూములకు సంబంధించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యే కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించేవి .
![Telugu Bhadrachalam, Cm Kcr, Munugodu, Ts-Telugu Political News Telugu Bhadrachalam, Cm Kcr, Munugodu, Ts-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/08/munugodu-Cpi-Cpm-cm-kcr-Bhadrachalam-ts-politics-elections-brs.jpg)
ప్రజలు కూడా వాటిని ఆ స్థాయిల్లో ఆదరించేవారు.అయితే ఆ పార్టీ తీసుకున్న అనేక విధానపరమైన నిర్ణయాలు, ప్రజల ఆలోచన సరళంలో వచ్చిన మార్పులు , దేశ ఆర్థిక విధానాలలో వచ్చిన పెట్టుబడిదారీ విదానాలతో క్రమంగా కమ్యూనిస్టు పార్టీల భావాలతో ప్రజల దూరం అయ్యి ప్రస్తుతం ఆ పార్టీల మనుగడ కూడా ప్రశ్నార్ధకం అయ్యే స్థాయికి దిగజారిపోయాయి.
![Telugu Bhadrachalam, Cm Kcr, Munugodu, Ts-Telugu Political News Telugu Bhadrachalam, Cm Kcr, Munugodu, Ts-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/08/munugodu-Cpi-Cpm-cm-kcr-Bhadrachalam-ts-politics-elections.jpg)
ఏదో ఒక ప్రధాన పార్టీకి తోక పార్టీలు లాగా కొనసాగాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి .తెలంగాణ వరకు చూసుకుంటే గత మునుగోడు( Munugodu ) ఉప ఎన్నికలలో అధికార బారాశకు మద్దతు ఇచ్చిన ఆ పార్టీలు వచ్చే ఎన్నికలలో బారాస పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు అని భావించాయి కేసీఆర్ కూడా అందుకు అనుకూలంగా ఉండడంతో కనీస స్థాయిలో సీట్లను ఆశించాయి అయితే ఒకటి రెండు స్థానాలలో తప్ప చెప్పుకోదగ్గ వోటు బ్యాంకు లేని కమ్యూనిస్టు పార్టీలకు కేసీఆర్ మొండి చూపించారు . భద్రాచలం( Bhadrachalam )లో సిపియం కి మునుగోడులో సిపిఎ కి ఎమ్మెల్యే సీటు ఇస్తామని రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఇస్తామని కేసీఆర్( CM KCR ) ఇచ్చిన ఆఫర్కు ఎర్రన్న లు అంగీకరించలేనట్లుగా తెలుస్తుంది.దాంతో తన దోవ తాను చూసుకున్న కేసీఆర్ ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక కమ్యూనిస్టులతో పొత్తు అసాధ్యమని తేలిపోయింది.మరి ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే అంత సత్తా గారిని ఆర్థిక వనరులు గానీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తు కార్యాచరణ కోసం ఇరు పార్టీలు సంయుక్తంగా సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది.
మరి ఎర్రన్న ల తక్షణ కర్తవ్యం ఏమిటో సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి
.