ఏపీఎస్ ఆర్టీసీలో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో కరోనా భయం వెంటాడుతోంది.రవాణా సంస్థ ఉద్యోగులకు కరోనా కాటు వేస్తోంది.

 Apsrtc Employees Infected With Corona, Corona Effect, Corona Virus,rtc Circular-TeluguStop.com

ఆగస్టు 2వ తేదీ వరకు ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 1,187 మంది కరోనా బారినపడ్డారని అధికారులు వెల్లడించారు.వీరిలో 18 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు తెలుపుతున్నారు.

కానీ, కరోనా బారిన 20 మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని తెలుపుతున్నారు.

ఈ మేరకు రాష్ట్రంలో వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభం కాగానే ఈయూ, ఎన్ఎంయూ, ఎస్ డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు.ఈ వినతి పత్రంలో ఆర్టీసీ సిబ్బందికి కరోనా మెరుగైన వైద్యం అందించాలని, కరోనా బారిన ఎవరైనా సిబ్బంది మృతి చెందినట్లయితే వారికి రూ.50 లక్షల బీమా అందించాలని అడిగినప్పుడు జూలై 15న ఆర్టీసీ సర్క్యూలర్ జారీ చేసిందన్నారు.

ప్రస్తుతం కరోనా సోకిన బాధితులను రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని ఆదేశించారు.రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న ఆస్పత్రుల్లో కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

బయట రెఫరల్ ఆస్పత్రికి వెళ్లినా బెడ్లు లేవని, క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారన్నారు.తక్షణమే ఆర్టీసీ సిబ్బంది సమస్యలను తీర్చాలని ఆర్టీసీ అధికారులను ఆర్టీసీ సంఘాలు కోరుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube