సర్దార్ గబ్బర్ సింగ్ పై కేసు

దబాంగ్ అనే సినిమా అటు సల్మాన్ ఖాన్ కెరీర్ ని, ఇటు పవన్ కళ్యాణ్ కెరీర్ ని మార్చేసింది.దబాంగ్ రాకముందు సల్మాన్ ని, గబ్బర్ సింగ్ రాకముందు పవన్ ని నెం.1 రేసులోంచి తీసేసింది మీడియా.కాని తిక్క పోలిసోడి తిక్కవేశాలు జనాల్ని ఎంతలా ఆకట్టుకున్నాయంటే .ఈ ఇద్దరి ఇమేజ్ ఒక్కసారిగా పది మెట్లు ఎక్కేసింది.దబాంగ్ హక్కులని తీసుకోని గబ్బర్ సింగ్ తీసి బ్లాక్బస్టర్ కొట్టారు సరే … మరి సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి ఏంటి ?

 Copy Rights Case On Sardaar Gabbar Singh-TeluguStop.com

ఇందులో కూడా దబాంగ్ లోని చుల్ బుల్ పాండేని పోలిన క్యారెక్టరే కదా ఉండేది.మరి దీనికి కూడా హక్కులు తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ – దబాంగ్ నిర్మాత, సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో మనకు తెలియదు కాని … ఇప్పుడు ఈ హక్కుల విషయం రసవత్తరంగా మారనుంది

ఎందుకంటే దబాంగ్ నిర్మాతలు అర్బాజ్ ఖాన్, ధిల్లీన్ మెహ్త సర్దార్ గబ్బర్ సింగ్ మేకర్స్ మీద కాపిరైట్స్ ఉల్లంఘన నేరం కింద కేసు వేసేసారని వార్త.ఈ కేసు సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకి అడ్డంకిగా మారుతుందా లేక పవన్ కళ్యాణ్ పరిష్కరించుకుంటాడా అనేది చూడాలి.

ఇప్పటివరకైతే, ఏప్రిల్ 8న ఉగాది కానుకగా ఈ గబ్బర్ సింగ్ సీక్వెల్ విడుదల కానుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube