ఎన్నికల నిధుల కోసం కాంగ్రెస్ నయా స్ట్రాటజీని!

దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్( Congress ) ప్రస్తుతం తన పునర్వైభవం కోసం పట్టుదలగా కృషి చేస్తుంది .అయితే దశాబ్ద కాలం పాటు అదికారానికి దూరం గా ఉండడం తో కాంగ్రెస్ ప్రస్తుతం నిధులు కోరత తో కిటకిట లాడుతుందట .

 Congress New Strategy For Election Funds , Congress, Election Funds , Assembly-TeluguStop.com

గణాంకాల ప్రకారం కాంగ్రెస్ నిధులు కేవలం ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు మాత్రమే.అదే సమయంలో బజాపా నిదుల విలువ 6046 కోట్ల రూపాయలు .భారీ నిధులతో భాజపా పార్టీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది .కేంద్రం లో అధికారం తో పాటు వివిద రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ కోల్పోవడం తో కార్పొరేట్ల నుంచి కాంగ్రెస్కు వచ్చే నిధులు తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తుంది.అదే సమయంలో భాజపాకు భారీ ఎత్తున నిధుల జమ కార్పొరేట్ కంపనీల నుంచి ఉంది.అయితే ఇప్పుడు ఈ నిదుల కొరతను ఎదురుకోవడానికి కాంగ్రెస్ విన్నూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది.

Telugu Aam Aadmi, Assembly, Congress, Funds-Telugu Top Posts

ఇప్పటికే రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) ప్రచారాన్ని చాలా వరకు పూర్తి చేసినందున వీటి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ పండింగ్ ను భారీ ఎత్తున ప్రచారం చేయాలని తద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నిధులు కొరత ఉండకుండా చూసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇదే పద్ధతిని ఒకప్పుడు ఆమ్ ఆద్మీ ( Aam Aadmi )కూడా అనుసరించి పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ చేసింది.అంతేకాకుండా ఇలా క్రౌడ్ పండింగ్ ద్వారా సమీకరించిన మొత్తాలను అధికారికంగా ఖర్చుపెట్టి వెసులుబాటు పార్టీలకు ఉంటుంది.

Telugu Aam Aadmi, Assembly, Congress, Funds-Telugu Top Posts

ప్రజలను కూడా ప్రత్యక్ష బాగస్వాములను చేసినట్టు కూడా ఉంటుంది .రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకి పన్ను మినహాయింపులు కూడా ఉండడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆయా పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది .ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అధికారం సాధించాలని కృత నిశ్చయం తో ఉన్న కాంగ్రెస్ అందుకే అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతుంది.ఇప్పటికే ఇండియా కూటమి ఏర్పాటు తో భాజాపాకు సమాన పోటీ ఇస్తున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలోనూ కూడా ఎక్కడా వెనకడుగు వేయకూడదన్న పట్టుదలతో ఉంది.

వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కనుక మంచి ఫలితాలు సాధిస్తే కాంగ్రెస్కు దశ తిరుగుతుందని చెప్పవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube