ఏపీ అధికార పార్టీ వైసిపి నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్లేనరీ ఊహించిన దానికంటే సక్సెస్ అయింది.జగన్ అంచనాలకు మించి మరి ఈ ప్లీనరీకి పార్టీ నాయకులు హాజరు కావడంతో రెట్టింపు ఉత్సాహతో జగన్ తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, కీలక నాయకులు తమ ప్రసంగాలను వినిపించారు.
ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులను గట్టిగా విమర్శించడంతో పాటు, రాబోయే రోజుల్లో వైసీపీని మరింతగా జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే విషయం పైన ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ నాయకులు మాట్లాడారు.ఎప్పుడు లేని విధంగా జగన్ సైతం ఈ ప్లీనరీ లో అన్ని అంశాల పైన మాట్లాడారు.
తన ప్రసంగంలో మాట్లాడిన మాటలు పరిశీలిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే సంకేతాలను పార్టీ నేతలకు పరోక్షంగా ఇచ్చినట్టుగా కనిపిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లోనే జగన్ జనాల్లోకి వెళ్ళబోతున్నారు పూర్తిస్థాయిలో జనాల్లో ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు.
ఎప్పటి నుంచో రచ్చబండ కార్యక్రమం చేపట్టాలి అని చూస్తున్న, ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.అయితే ఇప్పుడు రచ్చబండ కు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.
ప్లీనరీ వేదికగా పార్టీ నాయకులంతా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ జగన్ పిలుపునిచ్చారు.ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా లేదా అనే విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వకపోయినా.ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని విధంగా సంకేతాలను ఇచ్చారు.ఇక వైసిపి ముఖ్య నాయకులకు ఈ విషయంలో క్లారిటీ ఉంది.
షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఒక ఏడాది ముందుగానే అంటే 2023 డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు జగన్ ఉన్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా.ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.అప్పటిలోగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం అన్ని హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట.
జగన్ సమావేశంలో మాట్లాడిన మాటలు ఇదే విధంగా కనిపిస్తున్నాయి.వైసిపి ప్రభుత్వం ద్వారా తమకు మేలు జరిగింది అనుకుంటేనే ఓట్లు వేయాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తే వైసిపి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సాధారణ ఎన్నికలకు వెళ్లినా గెలుపుకు ఎటువంటి డొకా ఉండదు.ఈలోగా తమ రాజకీయ ప్రత్యర్థులు బలపడకుండా తగిన రాజకీయ వ్యూహాలను జగన్ అమలు చేయాల్సిందే.