ఏపీలో ఎన్నికలు మరో రెండేళ్లలో రాబోతున్న తరుణంలో అన్ని పార్టీలు జోరుపెంచాయి.వైసీపీ నేతలు ప్లీనరీల పేరుతో ప్రజల్లో ఉంటున్నారు.
మరోవైపు టీడీపీ మహానాడు జోష్ తో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఉన్నారు.ఇప్పటికే అధినేత చంద్రబాబు నిత్యం ప్రజల్లోనే గడుపుతున్నారు.
ఇక జనసేన కూడా జనంలోకి వెళ్లడానికి బస్సు యాత్రలు ప్లాన్ చేస్తోంది.వచ్చే ఎలక్షన్లలో వైసీపీకి అధికారం దక్కకుండా ప్రతిపక్షాలు ఎత్తుగడలు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్లతోనే మమేకం అవుతున్నారు.జిల్లాల పర్యటనలో బాబుకి మంచి స్పందన కూడా లభిస్తోంది.
అయితే టీడీపీ నేతల్లో మాత్రం ఆ జోరు హుషారు కనిపించడం లేదని విశ్లేషకులు అనే మాట.
బాబు లక్ష్యానికి అనుగుణంగా ప్రజల్లో ఉండటం లేదనే వాదన వినిపిస్తోంది.
కేవలం ప్రెస్ మీట్లు బాబు వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్పితే కష్టపడుతున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు.ఒకవైపు పార్టీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రజలలో ఉండాలని మహానాడు వేదికగా సూచించారు.
కష్టపడ్డవారికే పదవులు వరిస్తాయనీ చెప్పారు.అందుకు తాను కూడా అతీతం కాదని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు.
ప్రజల్లో ఉంటూ వారి మద్దతుతోనే వచ్చే ఎన్నికల్లో జెండా పాతాలని చూస్తున్నారు.అయితే బాబు స్ఫూర్తి.
వ్యూహం టీడీపీ నేతల్లో కనిపించడం లేదని అంటున్నారు.ఈ జిల్లాలో చూసుకున్నా నేతలు ఎక్కడా ముందడు వేయడం లేదని కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్నారని అంటున్నారు.
అంతేకాకుండా అధినేత మెప్పు కోసమే ప్రజల్లో ఉంటున్నారు తప్పితే ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకోవడం లేదని వినిపిస్తోంది.

మీడియా ముందు చేసే హడావుడి ప్రజల్లో చేస్తే బాగుంటుందని అంటున్నారు.2019 ఎన్నికల ఫలితాల తర్వాత బాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఎంతగానో కష్టపడుతున్నారు.పార్టీ పటిష్టతకు కృషిచేస్తున్నారు.
ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ ఉద్యమాలు నిరసనలు వ్యక్తం చేశారు.అయితే ఈ స్పూర్తి నాయకుల్లో ఉండే ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని.
అలా కాకుండా అధినేత వద్ద మార్కులు కొట్టేయాలనే తాపత్రయం తప్పా మరేమీ లేదంటున్నారు.

మరో రెండేళ్లలో ఎన్నికలు వచ్చే నేపథ్యంలో ఇప్పటికైనా నాయకుల తీరు మారకపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అంటున్నారు.నేతలు మీడియా ముందు హడావుడి కాకుండా ప్రజల్లో ఉండాలని.మైకుల ముందు హడావుడి మానేసి కార్యకర్తలను ఐక్యం చేయడంలో బిజీగా ఉండాలని సూచిస్తున్నారు.
బాబుకి నేతల కృషి తోడైతే ఫలితం ఉంటుందని అంతా బాబు నెత్తిపైన ఎత్తకూడదంటున్నారు.మరి టీడీపీ నేతల్లో ఇప్పటికైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.