అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.పర్యటనలో భాగంగా ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.కాగా రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది.తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఏలేరు ఎడమ కాలువను తాండవ కాలువతో అనుసంధానం చేయడం ద్వారా కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది.
దీంతో పాటు తాండవ ప్రాజెక్టు కింద సుమారు 51,465 ఎకరాలను స్థిరీకరించనున్నారు.దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.