ఈ సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమా లతో పాటు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన తెలుగు చిత్రం వారసుడు కూడా ఈ సంక్రాంతి కి విడుదల కాబోతుంది.
ఈ మూడు సినిమాలు హోరా హోరీగా సంక్రాంతి పోరులో తలపడబోతున్నాయి.దిల్ రాజు వారసుడు సినిమా ను నిర్మించిన విషయాన్ని తెలిసిందే.
అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లు దిల్ రాజు ఆధీనంలో ఉంటాయి.ఆయన అనుకుంటేనే చిన్న సినిమా కైనా పెద్ద సినిమా కైనా ఎక్కువ థియేటర్స్ లభిస్తాయి.
ఇప్పుడు వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాల కంటే ఎక్కువగా వారసుడు సినిమా కు థియేటర్లు ఆయన కేటాయిస్తున్నాడు.ఇటీవల నిర్మొహమాటంగా తన సినిమాలు కాదని వేరే సినిమా లకు థియేటర్లు ఇచ్చే అంత గొప్ప మనసు నాది కాదు అన్నట్లుగా దిల్ రాజు పేర్కొన్నాడు.ఈ నేపథ్యం లో దిల్ రాజు తో మెగాస్టార్ చిరంజీవి లేదా నందమూరి బాలకృష్ణ మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రచారం జరుగుతుంది.తమ సినిమా లకు థియేటర్లు కేటాయించాల్సిందిగా చిరంజీవి లేదా బాలకృష్ణ స్వయం గా అడిగితే కచ్చితంగా దిల్ రాజు కాదనడు.
అందుకే మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ ఇద్దరినీ రంగం లోకి దించి దిల్ రాజు యొక్క మెడలు వంచాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అదే నిజం అయితే చిరంజీవి లేదా బాలకృష్ణ అడిగితే దిల్ రాజు కాస్త వెనక్కు తగ్గి థియేటర్స్ సమానంగా షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
దిల్ రాజు తో ఆ ఇద్దరు హీరోలు మాట్లాడతారా లేదా అనేది చూడాలి.ఒక వేళ వారు మాట్లాడితే దిల్ రాజు స్పందన ఏంటో.!
.