కాంగ్రెస్ జోడో యాత్రకు.. స్మృతి ఇరానీ..?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంచుకోటలో ఆయన్ను ఓడించి ఇంటికి పంపిన వ్యక్తి స్మృతి ఇరాని.ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ లో మొదటి సారి బీజేపీ జెండా ఎగుర వేశారు.

 Smriti Irani Invited To Join Rahul Gandhi's Bharat Jodo Yatra Congress Jodo Yat-TeluguStop.com

దాంతో ఆమెకు ఏకంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది.కాంగ్రెస్ పార్టీ అంటే చాలు ఒంటి కాలిమీద లేచే ఆమె.ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.అమేథీలో ఓడిపోతారని సర్వేలు చెప్పడంతో.

రాహుల్ కేరళలోని వయునాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు.అలా రాహుల్ ను ఉత్తర భారత దేశం నుంచి దక్షిణాదికి పంపిన ఆమె.ఇప్పుడు రాహుల్ తో కలిసి నడుస్తారు అనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొనాలంటూ.

కాంగ్రెస్ పార్టీ స్మృతి ఇరానీని ఆహ్వానించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.అయితే కాంగ్రెస్ కావాలనే ఆహ్వానం పంపిందా.? లేక ఆమెకు పార్టీ మారే ఆలోచన ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి.కాంగ్రెస్ పార్టీ మాత్రం.

యాత్ర సాగే ప్రతీ నియోజకవర్గంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు.ఇందులో భాగంగానే.

ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేత దీపక్ సింగ్.కేంద్ర మంత్రికి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఆహ్వానం డైరెక్ట్ గా స్మృతి ఇరానీకి ఇవ్వకుండా.గౌరీగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కార్యదర్శి.నరేష్ శర్మకు అందించారు.మరి ఈ యాత్రలో ఆమె పాల్గొంటారా.? లేక ఆయన యాత్రను విమర్శిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఈ ఆహ్వానంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాత్రం మండిపడ్డారు.

ఈ యాత్రలో బీజేపీ శ్రేణులెవరూ పాల్గొనేది లేదన్నారు.మరి ఇంత రచ్చ జరుగుతున్నా.

ఆమె ఎందుకు స్పందించడం లేదనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube