ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్( YCP CM Jagan ) కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఒకపక్క సిద్ధం సభలతో పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో మరొక పక్క ముఖ్యమంత్రిగా కీలక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్ సిద్ధం కావడం జరిగింది.విశాఖ నగరం( Visakhapatnam )లో జరిగే పారిశ్రామిక వ్యాపారవేత్తల సదస్సుకు హాజరు కాబోతున్నారు.
విశాఖ విజన్ ఏపీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ పై సీఎం ప్రసంగించనున్నారు.అనంతరం విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత “భవిత”( Bhavitha ) పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
అంతేకాదు వ్యాపారవేత్తలతో పాటు ఐటీ, సీఐఐ, వివిధ అసోసియేషన్లు, రియల్ ఎస్టేట్, పాఠశాలలు( Schools ), కళాశాలలు, లాజిస్టిక్స్, ఆసుపత్రులు, పర్యాటకం తదితర రంగాల ప్రముఖులతో కూడా సమావేశం కాబోతున్నారు.ఈ పర్యటనలో ఎక్కువగా రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది.ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు ఒప్పందాలు జరగనున్నాయట.
రాష్ట్రంలో 90 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్ గా విశాఖ నుంచి ప్రారంభించబోతున్నారు.విశాఖలో అన్ని కార్యక్రమాలు ముగించుకుని .తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.