YCP : వైసీపీలో చేరిన బీజేపీ కీలక నేతలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.2024 ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈసారి ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదని కేడర్ కి తెలియజేస్తూ అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు.ప్రచారం విషయంలో ఇంకా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వైయస్ జగన్ మిగతా పార్టీల కంటే చాలా ముందంజలో ఉన్నారు.2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో దాదాపు 90 శాతానికి పైగా నెరవేర్చడంతో.క్యాడర్ కూడా ప్రజలలో ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటుంది.

 Ycp : వైసీపీలో చేరిన బీజేపీ కీలక -TeluguStop.com

దీంతో వైసీపీ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.ఈ రకంగానే ఆళ్లగడ్డ బీజేపీ( Allagadda BJP Leaders ) పార్టీకి చెందిన కీలక నేతలు జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెలియజేయడం జరిగింది.” సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్‌ రెడ్డి.కిషోర్‌ రెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి( Gandham Bhaskar Reddy ), అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నాయకులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపి పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి”.

పాల్గొన్నారు.అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube