మెగాస్టార్ చిరంజీవి 'వీర సింహారెడ్డి' వార్తలు నిజం కాదట!

మాస్ మహారాజా రవితేజ తో క్రాక్ సినిమా ను రూపొందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా వీర సింహారెడ్డి సినిమా ను రూపొందించిన విషయం తెలిసిందే.

 Chiranjeevi And Gopichand Malineni Combo Movie News Clarity,chiranjeevi,gopichan-TeluguStop.com

మొన్న సంక్రాంతి కి వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితా లో వీర సింహారెడ్డి చిత్రం నిలిచింది.

వరుసగా రెండు భారీ విజయాలను నమోదు చేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని కి మెగాస్టార్ చిరంజీవి నుండి పిలుపు వచ్చింది అనే ప్రచారం జోరుగా సాగింది.ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పాడని, స్టోరీ లైన్ కూడా రెడీ అయిపోయిందని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని రకరకాలుగా ప్రచారం జరిగింది.

కానీ అసలు విషయం ఏంటంటే అసలు చిరంజీవి వద్దకి దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మధ్య వెళ్ళనే లేదు, కథ చెప్పనే లేదట.మొత్తానికి రకరకాలుగా ఈ కాంబినేషన్ గురించి పుకార్లు షికార్లు చేశాయి.

గోపీచంద్ మలినేని ఆ మధ్య తాను ఒక లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆ కథ ఎవరితో చేయబోతున్నాడు అనే విషయం లో క్లారిటీ లేదు.

ప్రస్తుతానికైతే గోపీచంద్ మలినేని తదుపరి సినిమా విషయమై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.అయినా కూడా మీడియా లో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఇలా గ్యాప్ ఇవ్వడం ఏంటి అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి చిరంజీవి పిలిపించుకొని గోపీచంద్ మలినేని యొక్క కథ వింటారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube