హీరోయిన్ కి ఘోర అవమానం.. నీ మొహానికి అంత సీన్ లేదన్నారట

శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం ఈ పేరు కేవలం తెలుగు సినిమా పరిశ్రమ లోనే కాకుండా తమిళం హిందీ పరిశ్రమల్లో కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

 Adivi Sesh Heroine Sobhitha Dhulipala Comments Viral,sobhitha Dhulipala,adivi Se-TeluguStop.com

అక్కినేని నాగ చైతన్య తో ప్రస్తుతం ఈమె ప్రేమ లో ఉందని పుకార్లు కూడా షికారులు చేస్తున్న విషయం తెలిసిందే.సమంత నుండి విడి పోయిన తర్వాత నాగ చైతన్య కొంత కాలం ఒంటరి జీవితాన్ని గడిపాడు.

ఆ వెంటనే శోభిత ధూళిపాలతో ప్రేమాయణం మొదలు పెట్టాడని ప్రచారం సాగుతోంది.ఆ విషయం పక్కన పెడితే ఇటీవల ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ తన అందం విషయంలో కెరియర్ ఆరంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

తనకు 20 సంవత్సరాల వయసులో ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీ కి వెళ్లానని.వారు ఒక షాంపూ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలిసి అందులో అవకాశం కోసం అడిగానని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో వారు మీ యొక్క ఫేస్ బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరాదంటూ అవమానించి పంపించారు.బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా పనికి రాదంటూ అవమానించిన కంపెనీ వారే ఆ తర్వాత నన్ను రెండు సంవత్సరాలకు గాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారని పేర్కొంది.చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది.మొదట హిందీ సినిమా పరిశ్రమలు అడుగు పెట్టిన ఈమె గూఢచారి సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

ఆ మధ్య తమిళంలో విడుదల అయిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్‌ లో కూడా కనిపించిన విషయం తెలిసిందే.ఇక తెలుగు లో ప్రస్తుతం వరుసగా నటిస్తోంది.హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించేందుకు ఈమె ఓకే చెప్తోంది.వరుసగా సినిమాలు చేస్తున్న శోభిత ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

ఈ తెనాలి ముద్దుగుమ్మ ముందు ముందు మరిన్ని తెలుగు సినిమా లు చేయాలని అభిమానులు మరియు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube