చైనా, జపాన్ దేశాల మధ్య న్యూక్లియర్ వాటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసినదే.ఈ 2 దేశాల మధ్య పుకుషిమా అణు కర్మాగారం( Fukushima Nuclear Plant ) నుంచి సముద్రంలోకి జపాన్ విడుదల చేయడంతో రచ్చ రాజుకుందని చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని జపాన్ రాయబార కార్యాలయంపై( Japan Embassy ) రాళ్లదాడి జరగా తీవ్ర దుమారమే చెలరేగింది.దీంతో జపాన్, చైనాను తీవ్రంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ విషయమై దౌత్యకార్యాలయాలపై జరిగిన రాళ్లదాడిపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా( Japan PM Fumio Kishida ) చైనాపై మండిపడ్డారు.

అవును, పుకుషిమా అణు కర్మాగారం నుంచి శుద్ధి చేసిన అణు జలాలను జపాన్ పసిఫిక్ సముద్రంలోకి( Pacific Ocean ) విడుదల చేసింది.జపాన్, యూఎన్ న్యూక్లియర్ వాచ్ డాగా ఈ జనలాలు సురక్షితమని చెప్పినప్పటికీ చైనా( China ) మాత్రం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుండడం కొసమెరుపు.ఈ క్రమంలోనే జపాన్ చర్య తర్వాత చైనా ఆ దేశం నుంచి సముద్ర దిగుమతులపై నిషేధం విధించింది.
కాగా చైనాలో ఉండే తమ పౌరులకు జపాన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.బహిరంగ ప్రదేశాల్లో జపనీస్ మాట్లాడవద్దని సూచించింది.అంతేకాకుండా తాజాగా జపాన్ రాయబార కార్యాలయం, జపనీస్ స్కూళ్లపై రాళ్ల దాడిపై కిషిడా తీవ్రంగా స్పందించారు.ఇదే విషయమై చైనా రాయబారిని పిలిచి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఇకపోతే, 12 ఏళ్ల క్రితం జపాన్ లో వచ్చిన సునామీ కారణంగా ఈ పుకుషిమా అణుకేంద్రం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి విదితమే.అపుడు సునామీ( Tsunami ) అలల ధాటికి 3 రియాక్టర్లు దెబ్బతిన్నాయి.ప్రస్తుతం దెబ్బతిన్న అణు కేంద్రం నుంచి ప్లాంట్ ఆపరేటర్ TEPCO ట్రిటియం మినహా అన్ని రేడియోధార్మిక మూలకాలు ఫిల్టర్ చేయబడ్డాయని, వాటి స్థాయిలు సురక్షితంగా ఉన్నాయని కూడా జపాన్ అధికారికంగా ప్రకటనలు చేసింది.ఈ విషయంలో ప్రూఫ్స్ కూడా చూపిస్తోంది.
కానీ జపాన్ చర్యలు చైనా గొడ్డలి పెట్టులాగా ఫీల్ అవుతోంది.ఇక సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి!