చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్( Lucknow Super Giants ) టీమ్ లా మధ్య ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎలాగైనా సరే చెన్నై తన సత్తాను చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే గత మ్యాచ్ ల్లోనే లక్నో టీం పైన భారీ ఓటమిని చవిచూసింది.
కాబట్టి ఈ మ్యాచ్ లో చెన్నై ఎలాగైనా గెలిచి తమ సత్తా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందుకు తగ్గట్టుగానే భారీ కసరత్తులను కూడా చేస్తుంది.
మరి ఇలాంటి క్రమంలో ఈ టీం ఎంతటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలీదు గానీ మొత్తానికైతే ఒక మంచి విజయాన్ని అయితే సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది.ఇక ఈ మ్యాచ్ లో ఋతురాజు గైక్వాడ్, శివం దూబే, మహేంద్రసింగ్ ధోనీ( Gaikwad , Dube ) లాంటి ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ కనబరిస్తే మాత్రం ఈ టీమ్ ఈజీగా ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధిస్తుంది.అలాగే బౌలింగ్ లో మతిషా పతిరాన( Matheesha Pathirana ) తనదైన మార్క్ బౌలింగ్ వేయగలిగితే చెన్నైకి డోకా లేదు చెన్నై కనక మొదట బ్యాటింగ్ చేసినట్టైతే 200 పైన పరుగులు చేయాల్సి ఉంటుంది.
అలాగే లక్నో సూపర్ జాయింట్స్ మీదట బ్యాటింగ్ చేసినట్లయితే తక్కువ స్కోరుకే ఈ టీమ్ ను కట్టడి చేయాలి అలా చేసినట్లయితే చెన్నై టీం ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక లక్నో టీంలో కూడా అద్భుతమైన బ్యాట్స్ మెన్లు ఉన్నారు వాళ్ళందరూ మంచి ఫామ్ లో కూడా ఉన్నారు.ఇక ఇది ఇలా ఉంటే చెన్నై లక్నో ను ఓడించి విజయాల బాట పడుతుందా? లేదంటే లక్నో చేతుల్లోనే ఓడిపోయి మరోసారి దారుణమైన ఓటమిని చవిచూస్తుందా అనేది తెలియాల్సి ఉంది…
.