పెరుగుతోన్న వలసలు.. రిషి సునాక్ చేతికి ‘‘ రువాండా పాలసీ ’’ , ఇక ఎవరూ ఆపలేరన్న యూకే ప్రధాని

దేశంలో నానాటికీ పెరుగుతున్న వలసలను తగ్గించడానికి ప్రధాని రిషి సునాక్ ( Prime Minister Rishi Sunak ) సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కఠినమైన చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం పెంచింది.

 Rishi Sunak Govt Gets Rwanda Bill Through Parliament , Nothing Will Stop Says Uk-TeluguStop.com

తాజాగా బ్రిటన్‌కు చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశించే వలసదారులను నిరోధించడానికి రూపొందించిన పాలసీని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఆశ్రయం కోరేవారిని రువాండాకు పంపకుండా తనను ఎవరూ నిరోధించలేరని ప్రధాని రిషి సునాక్ ప్రతిజ్ఞ చేశారు.

అయితే బిల్లు ఆమోదం పొందిన కొన్ని గంటల్లోనే ఇంగ్లీష్ ఛానెల్‌ని దాటే ప్రయత్నంలో కనీసం ఐదుగురు వలసదారులు మరణించినట్లుగా ఫ్రెంచ్ వార్తాపత్రిక( French newspaper ) నివేదించింది.అయితే ఫ్రెంచ్ తీర రక్షక దళం ఈ వివరాలను ధృవీకరించాల్సి వుంది.10 వేల మంది వలసదారులు.ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలలో యుద్ధాలు, పేదరికం కారణంగా యూకేకు వలస వస్తున్నారు.అయితే ఇటీవలి కాలంలో ప్రజలను అక్రమ రవాణా చేసే ముఠాలు ప్రమాదకరంగా చిన్న బోట్ల ద్వారా బ్రిటన్‌కు చేరవేస్తున్నారు.

Telugu English Channel, French, Uk Pm, Rishi Sunak, Rwanda-Telugu Top Posts

సునాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు చట్టంగా మారిన తర్వాత.ఇకపై ఆశ్రయం కోరేవారిని నిర్బంధించడానికి అధికారులకు వెసులుబాటు కలుగుతుంది.తద్వారా రువాండా సురక్షితమైన గమ్యస్థానం కాదని వాదించే స్వచ్ఛంద సంస్థలు, ప్రచారకులు, యూనియన్‌ల ద్వారా మరిన్ని చట్టపరమైన సవాళ్లకు ప్రేరేపిస్తుంది.వలసల ప్రవాహాన్ని అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రాధాన్యత అయినప్పటికీ, ఆశ్రయం కోరేవారిని యూకే భూభాగంలో నిర్బంధించకుండా రువాండాకు బహిష్కరించడం అమానవీయమని విమర్శలు అంటున్నారు.

ఈ తూర్పు ఆఫ్రికా దేశం గతంలో మానవ హక్కులను ఉల్లంఘించిన ఉదాహరణలను ప్రస్తావించారు.

Telugu English Channel, French, Uk Pm, Rishi Sunak, Rwanda-Telugu Top Posts

కొత్త చట్టం ప్రకారం.ఇప్పటికే వున్న కొన్ని యూకే( UK ) మానవ హక్కుల చట్టాలు ఈ పథకానికి వర్తించవు.రువాండాను బ్రిటీష్ న్యాయమూర్తులు సురక్షితమైన గమ్యస్థానంగా పరిగణించాలి.కొన్ని అసాధారణ కేసులకు మాత్రమే ఈ చట్టం కింద అప్పీల్‌ను పరిమితం చేశారు.10 నుంచి 12 వారాల వ్యవధిలోగా మొదటి విమానాలు బయల్దేరతాయని, ఎయిర్‌ఫీల్డ్ సిద్ధంగా వుందని ప్రధాని రిషి సునాక్ తెలిపారు.విమానాల కోసం స్లాట్‌లు బుక్ చేశామని.వలసదారులను ఎస్కార్ట్ చేయడానికి 500 మంది సిబ్బంది కూడా సిద్ధంగా వున్నారని , అప్పీళ్లను ప్రాసెస్ చేయడానికి కోర్టులను కూడా రిజర్వ్ చేశారని ప్రధాని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube