మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాది చివరిన లేదా వచ్చే యేడాది మొదట్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇది చరణ్ 15వ సినిమా కావటం విశేషం.ఇక తన 16వ సినిమాను రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు మొదలుకానున్నాయి.

డైరెక్టర్ బుచ్చిబాబు( Director Buchibabu ) ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకంగా సెట్స్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.ఇది స్పోర్స్ట్ బ్యాక్ బ్రాప్ స్టోరీ అని, ఈ కథ కూడా 1980 నేపథ్యంతో కూడినదని ప్రచారం జరుగుతోంది.ఇలా ఈ కథకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ బుచ్చిబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయలేదని రూపాయి ఖర్చు చేసే చోట మరొక రూపాయి ఖర్చు అదనంగా చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని సెట్స్( Shooting Sets ) నిర్మాణం జరుగుతోందని ఈ సెట్స్ నిర్మాణం కోసం ఏకంగా వేల మంది కార్మికులు గత ఏడాది నుంచి పని చేస్తున్నారట.అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో సెట్స్ కోసమే ఏకంగా 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని సమాచారం.దర్శకుడి విజన్ కి తగ్గట్టు…అతడు కోరుకున్న విధంగా ప్రతీది ఉండాలని స్ట్రిక్ట్ అదేశాలు ప్రొడక్షన్ టీమ్ కి ఇచ్చి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తున్నారట.ఈ సినిమా మొదట్లో 200 కోట్ల బడ్జెట్ అంచనా వేయగా అంతకుమించి బడ్జెట్ ఖర్చవుతుందని తెలుస్తోంది.
ఖర్చు ఎంతైనా క్లారిటీ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పాలి.అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.