ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై జరిగిన దాడి డ్రామా కాదని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.షార్ప్ షూటర్ కొట్టినట్లుగా జగన్ పై దాడి జరిగిందని తెలిపారు.
రాళ్లు వేయించే అలవాటు టీడీపీ అధినేత చంద్రబాబుదని( Chandrababu ) మంత్రి బొత్స ఆరోపించారు.ఈ క్రమంలోనే దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు.
సీఎం జగన్ పై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెప్పారు.
చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సీఎం జగన్ పై దాడి జరిగిందన్న మంత్రి బొత్స జగన్ పై ఫోర్స్ గా రాయితో దాడి చేశారని ఆరోపణలు చేశారు.దాడులను చంద్రబాబు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు.
డ్రామాలు చేయడం, నటించడం చంద్రబాబుకు బాగా తెలుసని విమర్శించారు.జగన్ పై దాడి జరిగితే పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు.
కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం వెటకారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ డొల్లతనం ఆయన మాటల్లోనే తెలిసిపోయిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదని వెల్లడించారు.