టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )పై మంత్రి సిదిరి అప్పలరాజు( AP Minister Seediri Appalaraju ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉత్తరాంధ్రలో వలసల నివారణకు చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి సిదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు.జగన్ పాదయాత్ర( Cm ys jagan ) చేసిన సమయంలో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను చూశారన్న ఆయన ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనుకున్నారని తెలిపారు.
కానీ ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుంటే చంద్రబాబు ఒప్పుకోరని విమర్శించారు.చంద్రబాబు ఉత్తరాంధ్ర వాసుల కలలను కాలరాసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు.